రామ్‌చరణ్ వదులుకున్న 5 బ్లాక్‌బస్టర్లు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా పెద్ది చేస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ స్వరాలందిస్తున్నారు. క్రీడా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రామ్ చరణ్ తన కెరీర్ ప్రారంభంతోపాటు మధ్యలో కలిపి మొత్తం ఐదు సినిమాలను వదులుకున్నారు. వీటిల్లో నాలుగు సినిమాలు సూపర్ హిట్ అవగా, ఒకటి డిజాస్టర్ అయింది. వీటిని చెర్రీ ఎందుకు వదులుకున్నాడనే విషయాన్ని తెలుసుకుందాం.
ఈ సినిమా చేయడం సరికాదనే ఉద్దేశంతో..
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాని, సమంత నటించిన ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రం తెలుగు, తమిళంలో సూపర్ హిట్ అయింది. ఈ సినిమా చేయడానికి దర్శకుడు ముందుగా రామ్ చరణ్ ను కలిశారు. అయితే అప్పటికే ఆరెంజ్ రూపంలో భారీ డిజాస్టర్ ను అందుకున్న చెర్రీ ఈ సినిమా చేయడనికి వెనకాడాడు. దీంతో గౌతమ్ నానితో చేసి మంచి హిట్ అందుకున్నారు. దీని తర్వాత నాగచైతన్య మొదటి సినిమా జోష్ కథ రామ్ చరణ్ దగ్గరకు వచ్చింది. అయితే అప్పటికే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ సాధించి ఉన్న రామ్ చరణ్ ఈ సినిమా చేయడం సరికాదన ఉద్దేశంతో వద్దన్నాడు. దీంతో ఇది నాగచైతన్యతో తెరకెక్కింది.

మణిరత్నం అడిగినప్పటికీ నో చెప్పాడు
ఈ సినిమా తర్వాత మణిరత్నం ఓకే బంగారం సినిమా చేద్దామని అడిగారుకానీ ఎందుకనే రామ్ చరణ్ తిరస్కరించారు. తర్వాత మణిరత్నం దుల్కర్ సల్మాన్, నిత్యమీనన్ తో చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సినిమా చెర్రీ చేసివుంటే బాగుండేదని అభిమానులు కూడా బాధపడ్డారు. ఎందుకు తిరస్కరించారో అనుకున్నారు. ఆ తర్వాత గౌతమ మీనన్ మరోసారి చెర్రీతో సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా చేద్దామనుకున్నారు. కథ బాగుండి సినిమా చేద్దామనుకున్నప్పటికీ కాల్షీట్లు ఖాళీగా లేకపోవడం, వేరే సినిమా చేస్తుండటంతో వదులుకోవాల్సి వచ్చిది. దీంతో ఈ సినిమా సూర్యతో తెరకెక్కి ఘనవిజయాన్ని అందుకుంది. తర్వాత అఖిల్ చేసిన ఏజంట్ సినిమా కూడా రామ్ చరణ్ తో చేద్దామని దర్శకుడు సురేందర్ రెడ్డి కథ వినిపించారు. చిరంజీవితో సైరా నరసింహారెడ్డి సినిమా చేసే సమయంలోనే ఈ కథ చెప్పగా నచ్చకపోవడంతో వద్దని చెప్పారు. అఖిల్ చేయగా భారీ డిజాస్టర్ గా నిలిచిది. ఇలా రామ్ చరణ్ తన కెరీర్ లో ఐదు సినిమాలను మిస్ చేసుకున్నారు.












Click it and Unblock the Notifications