చిరంజీవి ఫామ్‌ హౌస్ ఖరీదు ఎంతో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి 69 సంవత్సరాల వయసులో కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తానే మెగాస్టార్ గా వెలుగొందుతున్నారు. మెగాస్టార్ అనే బిరుదు ఎప్పటినుంచైతే వచ్చిందో అప్పటినుంచి ఆయనకే కాకుండా ఆయన కుటుంబం నుంచి వచ్చిన హీరోలకు కూడా ఈ బిరుదు తగిలించారు. అందరూ మెగా హీరోలయ్యారు. అయితే అల్లు అర్జున్ మాత్రం ఐకాన్ స్టార్ అనే బిరుదును పొందారు. ప్రస్తుతం ఆయన మెగా కుటుంబానికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. చిన్న చిన్నగా మొదలైన విభేదాలు తీవ్రమై చివరకు కలవలేని స్థితికి ఇవి చేరాయి.

ఎంత ఖరీదు ఉంటుంది?
ఇంతకుముందు సంక్రాంతి పండగ వచ్చిందంటే చిరంజీవికి ఉన్న బెంగళూరులోని ఫామ్ హౌస్ లో సంబరాలు జరుపుకునేవారు. చిరంజీవి, ఆయన భార్య, సురేఖ, ఆయన తల్లితోపాటు, సోదరులు, సోదరీమణులు, వారి పిల్లలు.. ఇలా అందరూ కుటుంబాలతో సహా తరలివచ్చేవారు. సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకునేవారు. ఈ సారి సంక్రాంతి పండగకు మాత్రం అల్లు అర్జున్ రావడం కష్టమే కావొచ్చు. అభిమానులంతా చిరంజీవి ఫామ్ హౌస్ గురించి గూగుల్ లో వెదుకుతున్నారు. అది ఎక్కడ ఉంది? దాని ఖరీదు ఎంత? ఎలా ఉంటుంది? అనే విషయాలను శోధిస్తున్నారు.

mega star chiranjeevi bangalore farm house value details here

ఖరీదు రూ.30 కోట్లకు పైగా
ఈ ఫామ్​హౌస్ బెంగళూరుకు 35 కిలోమీటర్ల దూరంలోని దేవనహళ్లిలో ఉంది. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడి నుంచి చాలా దగ్గర. ఫామ్ హౌస్ ఖరీదు రూ.30 కోట్లకు పైగా ఉంటుంది. గతంలో ఎప్పుడో చిరంజీవి దీన్ని కొనుగోలు చేశారు. దీంతోపాటు ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఓ ఇల్లు ఉంది. దీన్ని అన్ని సౌకర్యాలతో అధునాతనంగా తీర్చిదిద్దారు. ఈ ఇల్లు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. ప్రస్తుతం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చిరు విశ్వంభర చిత్రం చేస్తున్నారు. త్రిష కథానాయికగా నటిస్తోంది. సోషియో ఫాంటసీ కథాంశంతో దర్శకుడు దీన్ని తీర్చిదిద్దుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+