చిరంజీవి ఫామ్ హౌస్‌ల విలువ ఎంతో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన స్వయంకృషితో సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా స్థాయికి ఎదిగారు. ఒక సందర్భంంలో ప్రముఖ లెజెండరీ దర్శకుడు దివంగత దాసరి నారాయణరావు మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమ గురించి రాయాలంటే చిరంజీవికి ముందు, చిరంజీవి తర్వాత అని రాయాలని చెప్పారంటే చిరంజీవి ముద్ర పరిశ్రమపై ఎంతగా ఉందోఅర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే సినిమాలద్వారా తనకు వస్తున్న ఆదాయాన్ని జాగ్రత్తగా పొదుపు చేసుకుంటూ వచ్చారు.
బెంగళూరుకు సమీపంలో
సాధ్యమైనంతవరకు శోభన్ బాబు బాటలోనే నడుస్తూ ఖరీదైన స్థలాలను కొనుగోలు చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ స్థలాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఆయనకు ప్రత్యేకంగా మూడు ఫామ్ హౌస్ లు ఉన్నాయి. బెంగళూరు నుంచి 35 కిలోమీటర్ల దూరంలో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో ఓ ఫామ్ హౌస్ ఉంది. దీని ఖరీదు రూ.35 కోట్లుగా ఉంది. ప్రతి సంవత్సరం మెగా కుటుంబ సభ్యులంతా సంక్రాంతికి అక్కడికి వెళ్లి పండగ జరుపుకుంటారు. దీని తర్వాత ఆయనకు హైదరాబాద్ కోకాపేటలో మరో ఫామ్ హౌస్ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ధరలు పెరగక ముందు ఆయన అక్కడ స్థలాన్ని కొనుగోలుచేసి ఫామ్ హౌస్ నిర్మించారు.

కోకాపేటలో పెరిగిన స్థలాల ఖరీదు
తర్వాత కోకాపేటలో స్థలాల ఖరీదు విపరీతంగా పెరగడంతో దాని విలువ రూ.200 కోట్లకు చేరింది. సైరా నరసింహారెడ్డి చిత్రం షూటింగ్ కూడా అక్కడే జరిగింది. ఆ సమయంలో సెట్స్ లో అగ్ని ప్రమాదం జరగడంతో ఆ ఫామ్ హౌస్ వార్తల్లోకెక్కింది. తాజాగా ఊటీలో కొండపై ఐదెకరాల స్థలంలో రూ.16 కోట్లతో స్థలాన్ని కొనుగోలు చేశారు. అక్కడ ఫామ్ హౌస్ నిర్మించబోతున్నారు. వేసవిలో కుటుంబంతో సహా అక్కడికి వచ్చి సేద తీరనున్నారు. కోకాపేట, ఊటీ, బెంగళూరు.. మూడు ప్రాంతాల్లో ఉన్న చిరంజీవి ఫామ్ హౌస్ ల విలువ దాదాపు రూ.300 కోట్లు అని ఓ మ్యాగజైన్ పేర్కొంది.
-
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
విడాకులు తీసుకుంటున్న శర్వానంద్?.. సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు డిలిట్ -
పెళ్లయిన నెల రోజులకే రష్మిక గుడ్ న్యూస్..? ముగ్గురం అయ్యామంటూ పోస్ట్ వైరల్.. -
అడవి శేష్ 'డెకాయిట్' మూవీ సెన్సార్ టాక్ ఇదే..! -
టాలీవుడ్లో మళ్లీ 'క్యాస్టింగ్ కౌచ్' కలకలం.. రంగంలోకి పూనమ్ కౌర్! -
టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి డేట్ ఫిక్స్.. అందరిలాగా కాకుండా కొత్తగా !! -
అన్నదమ్ముల డబుల్ బొనాంజా.. మొన్న సంతోష్.. ఇప్పుడు సంగీత్ !! -
బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి.. కాబోయే అల్లుడు అతనే ?? -
మధ్యతరగతి మనుషుల ఎమోషనల్ జర్నీ -
టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్.. తెలుగు ఎన్నారై ఇన్ ఫ్లూయెన్సర్ వీడియో వైరల్ ! -
ఒక్క వెబ్ సిరీస్ తోనే పిచ్చెక్కించే షాక్ ఇచ్చిన బ్యూటీ.. -
రాజమౌళి దర్శకత్వంలో మిస్ అయిన చిరంజీవి-నాగార్జున మల్టీస్టారర్












Click it and Unblock the Notifications