మెగాస్టార్ చిరంజీవి వదులుకున్న ఇండస్ట్రీ హిట్స్

మెగాస్టార్ చిరంజీవి అనే పేరే ఒక ప్రభంజనం. దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతున్న చిరంజీవి అలియాస్ శివశంకర వరప్రసాద్ మూడు దశాబ్దాలపాటు అగ్ర కథానాయకుడిగా కొనసాగారు. రాజకీయాల్లోకి వెళ్లి తిరిగి వెనక్కి వచ్చేసి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే ఈ ఇన్నింగ్స్ లో అనుకున్నంత స్థాయిలో విజయాలు పలకరించడంలేదు. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రం చేస్తున్నారు. ఈ ఏడాది మే 9న విడుదల కాబోతోంది. చిరంజీవి కథానాయకుడిగా బిజీగా ఉన్న సమయంలో ఎన్నో సినిమా కథలు తనదగ్గరకు వచ్చాయికానీ కాల్షీట్లు ఖాళీలేక, కథలు నచ్చక కొన్నింటిని వదులుకున్నారు. అవన్నీ బ్లాక్ బస్టర్ సినిమాలుగా నిలిచాయి. చిరంజీవి ఏయే సినిమాలు వదులుకున్నారో ఒకసారి తెలుసుకుందాం.

యండమూరి నవల ఆధారంగా
అర్జున్ కథానాయకుడిగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన మన్నెంలో మొనగాడు బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ సినిమా చిరంజీవి చేయాల్సివుంది. కానీ డేట్లు ఖాళీ లేకపోవడంతో సినిమా చేయలేదు. సంగీతం పరంగా కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించిన ఆఖరి పోరాటం సినిమాలో ముందుగా చిరంజీవి నటించాల్సి ఉంది. అయితే ఆ సమయానికి డేట్లు సర్దుబాటు చేయలేకపోయారు. చివరకు నాగార్జున, శ్రీదేవి కాంబినేషన్ లో తెరకెక్కి సూపర్ హిట్ గా నిలిచింది. యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

mega star chiranjeevi missed movies

చంద్రముఖిని వదులుకున్నారు
మోహన్ బాబు కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన అసెంబ్లీ రౌడీ సినిమా కూడా చిరంజీవి చేయాల్సివుంది. అయితే రాజకీయ నేపథ్యం ఉందని చిరంజీవి కాదనడంతో బి.గోపాల్ దర్శకత్వంలో మోహన్ బాబు చేసి చిరస్మరణీయమైన విజయాన్ని అందుకున్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ చేసిన నెంబర్ వన్ సినిమా కూడా చిరు వదులుకున్నారు. వెంకీ, శిల్పాశెట్టి జంటగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సాహసవీరుడు-సాగరకన్య కూడా ముందుగా చిరంజీవే చేయాల్సి ఉంది. అయితే అంతకుముందు ఇలాంటి కథలతో సినిమాలు వచ్చాయని, అవి ఆడలేదని చిరు వద్దనడంతో వెంకీ చేసి హిట్ కొట్టాడు. చంద్రముఖి సినిమాను చిరంజీవితో చేయాలని ఆ సినిమా నిర్మాతలు ఎంతగానో ఎదురుచూసి చిరంజీవి నుంచి సమాధానం రాకపోవడంతో చివరకు రజనీకాంత్ తో చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. రవితేజ చేసిన టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా చిరు చేయాల్సింది. కథ నచ్చకపోవడంతో వద్దనుకున్నారు. ఈ సినిమా ఘోరపరాజయం పాలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+