చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలయ్య సినిమా
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకులుగా కొనసాగుతున్నారు. బయట వీరిద్దరూ ఎంతో స్నేహంగా ఉన్నప్పటికీ సినిమాల విషయానికొచ్చేసరికి బాలయ్య అభిమానులకు, చిరంజీవి అభిమానులకు హోరాహోరీ యుద్ధం నడుస్తుంటుంది. ఇటీవలే వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర తలపడి ఇద్దరూ విజేతలుగా నిలిచారు. వీరిద్దరి నుంచి సినిమా వస్తోందంటేచాలు హైవేల్టేజ్ విద్యుత్తు ప్రసారమైనట్లే లెక్క.
కొత్త చరిత్రను సృష్టించిన సినిమా
పరిశ్రమలో అందరి హీరోల్లానే చిరంజీవికి కూడా బాలకృష్ణ సినిమాలంటే కొన్ని బాగా ఇష్టం. అందులోను బి.గోపాల్ దర్శకత్వంలో బాలయ్య నటించగా సంచలన విజయాన్ని సాధించిన సమరసింహారెడ్డి సినిమా అంటే చిరుకు చాలా ఇష్టం. అనేక సందర్భాల్లో చిరంజీవి ఈ విషయాన్ని చెప్పారు. తాను దీన్ని చాలాసార్లు చూశానన్నారు. ఈ సినిమాతోనే తెలుగు సినిమాల్లో హీరోలో తొడ కొట్టడం ప్రారంభమైంది. పాత రికార్డులను బద్దలుకొట్టి అనేక కొత్త రికార్డులను ఈ సినిమా సృష్టించింది. దీనితర్వాతే తెలుగులో ఫ్యాక్షన్ కథాంశంతో పలు సినిమాలు తెరకెక్కాయి.

బోరు కొట్టినప్పుడల్లా చూస్తా
టైం బాగోలేనప్పుడు, మనసు కుదురుగా లేనప్పుడు, బోరు కొట్టినప్పుడు ఎక్కువగా సమరసింహారెడ్డి సినిమానే చూస్తుంటానని చిరంజీవి చెప్పారు. అభిమానులకు పూనకాలు తెప్పించడంతోపాటు బాలయ్య సినిమా కెరీర్ ను ఇది బాగా మలుపు తిప్పింది. తెలుగు పరిశ్రమలో ఉన్న ఎంతోమంది హీరోలకు ఇప్పటికీ సమరసింహారెడ్డి సినిమా అంటే ఎంతో ఇష్టమైన సినిమాగా నిలిచింది. ఆరోజుల్లేనే దాదాపుగా 17 కోట్లరూపాయల షేర్ వసూలు చేసింది. అత్యధిక రోజులు ప్రదర్శితమైన సినిమాగా రికార్డులకెక్కింది. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రం చేస్తుండగా, బాలయ్య బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి పోటీపడబోతున్నాయి.
-
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్.. తెలుగు ఎన్నారై ఇన్ ఫ్లూయెన్సర్ వీడియో వైరల్ ! -
పెళ్లయిన నెల రోజులకే రష్మిక గుడ్ న్యూస్..? ముగ్గురం అయ్యామంటూ పోస్ట్ వైరల్.. -
'బైకర్' మూవీ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్.. 2 నెలల్లో 2 హిట్లు నీకే సాధ్యం అన్నా..! -
రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్.. చిన్న సినిమా కాదయ్యో !! -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
రాజమౌళి దర్శకత్వంలో మిస్ అయిన చిరంజీవి-నాగార్జున మల్టీస్టారర్ -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్










Click it and Unblock the Notifications