వరుణ్ తేజ్ పెళ్లికి చిరంజీవి ఖరీదైన గిఫ్ట్!
మెగా అభిమానులంతా ఎదురుచూసిన సందర్భంగా రానే వచ్చింది. వారందరూ ఆనందించేలా ఇటలీలో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహం అతిథుల మధ్య వైభవోపేతంగా జరిగింది. ఆరు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట పెద్దలను ఒప్పించి ఓ ఇంటివారయ్యారు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది ఇటలీలోనే కనుక వివాహం కూడా అక్కడే చేసుకోవాలనుకున్నారు.. చేసుకున్నారు.. తిరిగివచ్చారు.
మెగా కుటుంబ సభ్యులు సతీసమేతంగా హాజరవగా, రష్మిక, నాగచైతన్య, సమంతలాంటివారు కూడా హాజరయ్యారు. తెలుగు సంప్రదాయానికి అనుగుణంగా వివాహం జరగడతో అభిమానులు కూడా ఎంతో సంతోషించారు. రాజకీయంగా, సినిమాల పరంగా బిజీగా ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ సతీసమేతంగా హాజరవడం ఆయన అభిమానులను, మెగా అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.

తన తమ్ముడు నాగబాబు కొడుకు వరుణ్ పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి బహుమతి ఇస్తాడా? అని మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూశారు. చిరంజీవి రెండుకోట్ల రూపాయలు విలువచేసే ఖరీదైన డైమండ్ సెట్ ను బహుమతిగా ఇచ్చారు. దీన్ని చూసి భార్యాభర్తలిద్దరూ ఉబ్బితబ్బిబ్బయ్యారు. తాను కూడా ఇటువంటి ఆనందాన్ని మీలో చూడాలనుకున్నానని చిరంజీవి అన్నారు. వరుణ్-లావణ్య.. ఇద్దరికీ కార్లు అంటే మహా పిచ్చి. ఎప్పటికప్పుడు మార్కెట్ లోకి కొత్తగా వస్తున్న కార్లను కూడా వీరు టెస్ట్ డ్రైవ్ చేస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పవన్ కల్యాణ్ వారికి ఓ కొత్తమోడల్ కారు కొన్నిచ్చారు. ఆ కారులో వరుణ్, లావణ్య ఇష్టాఇష్టాలకు అనుగుణంగా కొన్ని ఫీచర్లు రూపొందించి మరీ ఇచ్చాడు. చిరంజీవి, పవన్ కల్యాణ్ తమ సోదరుడు నాగబాబు పిల్లల్ని కూడా సొంత పిల్లలకంటే బాగా చూసుకుంటారని అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు.












Click it and Unblock the Notifications