Chiranjeevi: అప్రమత్తంగా ఉండండి.. ప్రజలకు మెగాస్టార్ సూచన..
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. భారీ వర్షాలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. శనివారం విజయవాడలో కొండ చరియలు విరిగి పడి పలువురు మృతి చెందారు. ఈ భారీ వర్షాలు ఇవాళ, రేపు కూడా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలు నేపథ్యం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు.
"తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే... అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉండటం వల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడూ అభిమానులంతా అండగా ఉంటారని ఆశిస్తున్నాను" అని ట్వీట్ చేశారు.

గత రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలోని సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నారాయణపేట, గద్వాల, మహబుబ్ నగర్ లో భారీ వర్షాలు కురిశాయి. మిగతా జిల్లా కూడా వస్తారంగా వర్షాలు కురుస్తోన్నాయి. ఇటు హైదరాబాద్ లో కూడా ఎడతెరపు లేకుండా వాన పడుతోంది. వాతావరణ శాఖ మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
అటు ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తోన్నాయి. విజయవాడలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. దీంతో, అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.విజయవాడకు వచ్చే వాహనాలను నిలిపివేశారు. బొమ్మలూరు వద్ద హైవేపైకి వరద నీరు చేరుకుంది. పలు చోట్ల వరద నీరు చేరుకోవడంతో వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 1, 2024
మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే... అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉండటం…












Click it and Unblock the Notifications