కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌"గా ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలు నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించగా దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. మరోసారి గబ్బర్ సింగ్ మ్యాజిక్‌ను రిపీట్ చేస్తూ ఈ సినిమా బాక్సాఫీస్ దకలెక్షన్స్ వర్షం కుమ్మరిస్తుంది. మాస్ ఆడియన్స్‌కు మాత్రం కిక్ ఇచ్చే కమర్షియల్ ఎలిమెంట్స్ తో దూసుకుపోతుంది ఈ చిత్రం. పవన్ ఆటిట్యూడ్, హరీష్ మార్క్ టేకింగ్ కలగలిపి పండగ సీజన్‌లో ఈ సినిమా మాస్ జాతరను తలపిస్తోంది.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ మూవీని వీక్షించారు. చిరంజీవి ఈ చిత్రాన్ని ఆద్యంతం ఎంజాయ్ చేశారు. సినిమాలోని ప్రతి సన్నివేశం తనను ఆకట్టుకుందని, ముఖ్యంగా హరీష్ శంకర్ టేకింగ్, పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉన్నాయని ఆయన కొనియాడారు. కేవలం ఒక అన్నయ్యగా మాత్రమే కాకుండా, ఒక సినీ అభిమానిగా కూడా ఈ సినిమా తనకు ఎంతో కిక్ ఇచ్చిందని ఆయన పేర్కొనడం విశేషం.

megastar-chiranjeevi-along-with-family-members-watched-pawan-kalyan-ustaad-bhagath-singh-movie

అంతే కాకుండా ఈ సినిమాలో ముఖ్యంగా రెండు పాటల గురించి మెగాస్టార్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మెగాస్టార్ కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే వాన వాన వెల్లువాయే క్లాసిక్ సాంగ్‌ను 'ఉస్తాద్'లో రీమిక్స్ చేసిన విధానం చూసి ఆయన ఫిదా అయ్యారు. ఈ మనసే మెలోడీ సాంగ్ మరియు దాని పిక్చరైజేషన్ చూసి చిరంజీవి మెచ్చుకున్నారు. పాట వస్తున్నంత సేపు ఆయన ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉండడం వీడియోలో గమనించవచ్చు.

ఇక సినిమా విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ను చిరంజీవి అభినందించారు. చిత్ర యూనిట్ పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని, ప్రేక్షకులకు ఒక మంచి వినోదాత్మక చిత్రాన్ని అందించారని ఆయన ప్రశంసించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+