అందమే అసూయా పడేలా "మెగాస్టార్" కూతురు.. ఏం చేస్తుందంటే ?

మెగాస్టార్ చిరంజీవి 2001 లో నటించిన సినిమా 'డాడీ'. ఈ చిత్రంతో తన మాస్ ఇమేజ్‌కు భిన్నంగా ఫ్యామిలీ, భావోద్వేగ పాత్రలో కనిపించారు. అయితే సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా.. చిరు కెరీర్ లో ఒక స్పెషల్ మూవీగా మాత్రం నిలిచిపోయింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాను దర్శకుడు సురేష్ కృష్ణ రూపొందించారు. సిమ్రాన్ హీరోయిన్ గా చేసిన ఈ మూవీలో.. విలన్ పాత్రల్లో అశిష్ విద్యార్థి, రాహుల్ దేవ్ కనిపించారు. బ్రహ్మానందం, అలీ, సునీల్, సరథ్ బాబు వంటి వారు సహాయ పాత్రల్లో నటించారు. ఎస్‌.ఏ. రాజ్‌కుమార్ సంగీతం అందించగా.. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ మంచి ఆదరణ పొందుతూనే ఉన్నాయి.

ఇక మరి ముఖ్యంగా చిరంజీవి కూతురిగా చైల్డ్ ఆర్టిస్ట్ అనుష్క మల్హోత్రా (అక్షయ పాత్ర) నటించింది. తండ్రి - కూతుళ్లుగా వారి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ చిన్నారి అద్భుతమైన నటన, డైలాగ్ డెలివరీ, క్యూట్ లుక్స్‌తో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది.

megastar-chiranjeevi-daddy-movie-fame-anushka-malhotra-latest-photos-goes-viral

4 ఏళ్ల అక్షయ.. ఇప్పుడు 29 ఏళ్ల బ్యూటీ..

కాగా డాడీ సినిమాలో నటించే సమయానికి అనుష్క వయసు కేవలం నాలుగు సంవత్సరాలు. చిరుతో ఆమె చెప్పిన "అక్కి, డాడీ బోత్ ఆర్ ఫ్రెండ్స్" అనే డైలాగ్‌ను ఇప్పటికీ మెగా ఫ్యాన్స్ మర్చిపోలేరు. అప్పట్లో తన అమాయకత్వంతో మెప్పించిన అనుష్క.. ఇప్పుడు 29 ఏళ్ల యువతిగా మారింది. ముంబైలో జన్మించిన ఆమె, ప్రస్తుతం ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్లో ఉంటోంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె.. ప్రస్తుతం లండన్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ గా ఉద్యోగం చేస్తోంది.

అలానే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబధించిన విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన గ్లామరస్ ఫొటోలు, డ్యాన్స్ వీడియోలు షేర్ చేస్తూ కుర్రకారును కట్టిపడేస్తోంది. తన క్యూట్ లుక్స్ కి యువత ఫుల్ ఫిదా అయిపోతున్నారు. ఆమె లుక్స్, స్టైల్ చూస్తే ఏ స్టార్ హీరోయిన్‌కైనా తక్కువేమీ కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

megastar-chiranjeevi-daddy-movie-fame-anushka-malhotra-latest-photos-goes-viral

బాలీవుడ్‌ ఛాన్స్..

మరోవైపు 'డాడీ' సినిమా తర్వాత అనుష్క మల్హోత్రాకు బాలీవుడ్‌ నుంచి ఎన్నో ఆఫర్లు వచ్చాయని టాక్. కానీ ఆమె తల్లిదండ్రులు చదువు పాడవుతుందనే కారణంతో సినిమాలకు ఉంచినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆమె ఫోటోలు ఫుల్ వైరల్ అవుతుండడంతో.. ప్రస్తుతం అనుష్కకు బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నట్టు సమాచారం. అక్షయ పేరుతో గుర్తింపు పొందిన అనుష్క.. తిరిగి తెరపైకి వస్తుందా.. వస్తే రాణించగలుగుతుందా అని డిస్కషన్ నడుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+