దేవుడికి భక్తుడికి మధ్యలో నేను అంబికా ఆగర్బత్తినా - చిరు
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. సంక్రాంతి కానుకగానే ఆయన నటించిన "మన శంకర వరప్రసాద్ గారు" ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే తన 158వ సినిమాపై ఫోకస్ పెట్టారు. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు బాబీతో మళ్లీ మూవీ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ వేడుకకు మెగాస్టార్ సోదరుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పవన్ కళ్యాణ్‌తో పాటు మెగా బ్రదర్ నాగబాబు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
కాగా పలువురు డైరెక్టర్లు, సినీ ప్రముఖులు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలానే ఈ వేడుకకు బండ్ల గణేష్ కూడా వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ వీరాభిమానుల్లో బండ్ల గణేష్ కూడా ఒకరని అందరికీ తెలిసిందే. తనకు తాను పవన్ కు భక్తుడిగా ప్రకటించుకున్న బండ్లన్న.. 'ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. దేవరా' అంటూ ఇప్పటికే పలు సందర్భాల్లో తన అభిమానాన్ని బయటపెట్టారు.

అయితే గత కొంతకాలంగా పవన్ - బండ్ల గణేష్ మధ్య గ్యాప్ పెరిగిందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అప్పట్లో పవన్ సినిమా ఫంక్షన్ ఉందంటే, బండ్ల గణేష్ స్పీచ్ కచ్చితంగా ఉండాల్సిందే. కానీ కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్స్ లో ఆయన కనిపించడం లేదు. అయితే చాన్నాళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి కనిపించడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇక చిరంజీవి 'మెగా 158' చిత్ర పూజా కార్యక్రమాల వేదికగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బండ్ల గణేష్ ఈ వేడుకలో పవన్ పక్కనే నిలబడి సందడి చేశారు. బండ్ల భుజంపై పవన్ ఆప్యాయంగా చేయి వేసి దగ్గరకు తీసుకోవడం, ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే చిరంజీవి - పవన్ మధ్యలో నిలబడి గణేష్ ఫోటోలు దిగారు. చాలాసేపు నవ్వుతూ మాట్లాడుతూ కనిపించారు. చిరు సైతం బండ్లన్నపై ఏదో జోకులు వేసినట్లు తెలుస్తోంది.
అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో బండ్ల గణేష్ - పవన్ కళ్యాణ్ కలిసి ఫోటో దిగుతుండగా చిరంజీవి సరదాగా జోక్ చేశారు. దేవుడికి, భక్తుడికి మధ్యలో నేనెందుకు అంబికా అగర్బత్తి లాగ...అంటూ నవ్వులు పూయించారు. నిజానికి బండ్ల గత కొన్ని నెలలుగా మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉంటున్నారు. గతేడాది బండ్ల ఇంట నిర్వహించిన దీపావళి సెలబ్రేషన్స్ లో చిరంజీవి పాల్గొన్నారు. ఇటీవల బండ్ల గణేష్ కుమార్తె పెళ్లికి చిరు దంపతులు హాజరయ్యారు. ఇదంతా చూస్తుంటే, పవన్ కళ్యాణ్ తో బండ్లన్న బాండింగ్ మళ్లీ బలపడుతున్నట్లు కనిపిస్తోందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
దేవుడికి, భక్తుడికి మధ్యలో నేనెందుకు అంబికా అగర్బత్తి లాగ... 🤣 pic.twitter.com/XWHqH06XlP
— Rajesh Manne (@rajeshmanne1) May 22, 2026












Click it and Unblock the Notifications