బ్లాక్ బస్టర్ వదులుకున్న చిరంజీవి
రజనీకాంత్ కథానాయకుడిగా వచ్చిన తాజా చిత్రం జైలర్. బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాదు.. రూ.600 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి తలైవా స్టామినా ఏమిటో చూపించింది. తమిళంతోపాటు తెలుగు, కన్నడం, హిందీలో కూడా సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ దీన్ని నిర్మించారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా, రమ్యకృష్ణ, తమన్నా, యోగిబాబు, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
ఒక సినిమాకు కథ రాసుకునే సమయంలో దర్శకుడు తన కథకు తగ్గట్లుగా ఎవరు హీరో అయితే బాగుంటుందో అనే అభిప్రాయానికి వచ్చేస్తాడు. అలాగే నెల్సన్ ఈ సినిమా కథ రాసుకున్నప్పుడు రజనీకాంత్ కోసం కాకుండా చిరంజీవి కోసం పాత్రలు సృష్టించాడు. తర్వాత కథను తీసుకెళ్లి చిరంజీవికి చెప్పగా సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. సినిమాలో హీరోకు డాన్సులు, ఫైట్లు లేకపోవడంతోపాటు కొడుకు, మనవడు ఉండటం లాంటివన్నీ కలిసి ఆ సినిమాకు చిరంజీవి నో చెప్పేలా చేశాయి.

తర్వాత నెల్సన్ ఈ కథను రజనీకాంత్ దగ్గరకు తీసుకువెళ్లారు. ఓకే అనడంతో రజనీకి తగ్గట్లుగా కొన్ని ఎలివేషన్లు సీన్లు యాడ్ చేసుకొని సినిమాచేయడం.. అది బ్లాక్ బస్టర్ హిట్ అవడం వెంటవెంటనే జరిగిపోయాయి. అయ్యో.. చిరంజీవి ఒక బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకున్నాడే అంటూ అభిమానులు వాపోతున్నారు. జైలర్ తోపాటు విడుదలైన చిరంజీవి సినిమా భోళాశంకర్ డిజాస్టర్ గా నిలిచింది. మెహర్ రమేష్ దీనికి దర్శకుడు. ఈ సినిమా పరాజయంపాలైన తర్వాత చిరంజీవి తన వయసుకు తగినట్లుగా పాత్రలను ఎంచుకోవాలని, సినిమాలను చేయాలంటూ విమర్శలు వచ్చాయి.












Click it and Unblock the Notifications