అతని వల్ల నిద్రలేని రాత్రులు గడిపాను - చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. ఇండస్ట్రీకి చెందిన హీరోల కొడుకులు వారసులుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ వారిని దాటుకుని మరీ నెంబర్ వన్ స్థానాన్ని చిరంజీవి కైవసం చేసుకున్నారు. దాదాపు 30 ఏళ్లపాటు తెలుగులో టాప్ హీరోగా చిరంజీవి నిలిచారంటే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒకనొక సమయంలో దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా చిరంజీవి నిలిచారు.
సినిమాల్లో వచ్చిన క్రేజ్‌తో చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటికే చాలామంది హీరోలు రాజకీయాల్లోకి వచ్చి ఫెయిల్ అవ్వడాన్ని కళ్లరా చూసి కూడా ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009 సార్వత్రిక ఎన్నికల ముందు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఎన్నో అంచనాల మధ్య పోటీ చేసిన ప్రజారాజ్యం కేవలం 18 సీట్లలో మాత్రమే విజయం సాధించగలిగింది.ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి తిరిగి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారాయన. రీఎంట్రీలో కూడా కుర్ర హీరోలకు గట్టి పోటి ఇచ్చారాయన.

ఇక చిరంజీవి తాజాగా నటిస్తోన్న చిత్రం 'విశ్వంభర'. దసరా పండుగ నాడు మెగా అభిమానులకు చిరంజీవి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. 'విశ్వంభర' టీజర్ పండుగ సందర్భంగా శనివారం విడుదల చేశారు. 1.33 నిమిషాల నిడివి గల ఈ టీజర్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇదిలా ఉంటే ఓ హీరో కారణంగా చిరంజీవి ఎన్నో నిద్రలేని గడిపారట. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే ఓ ఇంటర్య్వూలో తెలిపారు.ఆ హీరో మరెవ్వరో కాదు లోక నాయకుడు కమల్ హాసన్. కమల్ హాసన్ నటించిన స్వాతిముత్యం అప్పట్లో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిగా విషయం తెలిసిందే.
ఈ సినిమాలో కమల్ నటనకు మెగాస్టార్ ఫిదా అయిపోయారట. అస్సలు ఇంత బాగా ఎలా నటించారని తనకు తానే ప్రశ్నించుకున్నారట చిరంజీవి. అసలు ఈ సినిమాలో నటించింది కమల్ హాసనేనా అనే సందేహం చిరంజీవిలో కలిగిందట. ఈ సినిమా చూసిన తర్వాత చాలా రోజులు చిరంజీవికి నిద్రపట్టలేదట. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా కమల్ హాసన్‌కు చెప్పారట. వీరిద్దరు మీట్ అయినప్పుడు చిరు.. కమల్ హాసన్ ను హగ్ చేసుకుని, అసలు ఎలా సాధ్యమైంది? అంతా బాగా ఎలా నటించారంటూ అంటూ కమల్‌పై చిరంజీవి పొగడ్తల వర్షం కురిపించారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications