దటీజ్ మెగాస్టార్.. చిరు జిమ్ వీడియో వైరల్ !!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. సంక్రాంతి కానుకగానే ఆయన నటించిన "మన శంకర వరప్రసాద్ గారు" ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ అందుకుంది. ఈ చిత్రంతో అటు మాస్, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకొని.. వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు పండగ చేసుకునేలా చేసింది. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టారు. వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' ఫినిష్ చేయగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలానే తన నెక్స్ట్ సినిమాను కూడా రీసెంట్ గానే తన పుట్టిన రోజు సందర్భంగా డైరెక్టర్ బాబీతో మూవీ అనౌన్స్ చేశారు. 'మెగా 158' వర్కింగ్ టైటిల్ తో ఆ మూవీ రాబోతుంది. గతంలో 'వాల్తేరు వీరయ్య'తో హిట్ కొట్టిన బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్‌లో రక్తంతో తడిసిన గొడ్డలి, రక్తం చిందిన బ్యాక్‌డ్రాప్ తో చూపించారు. ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించనుండగా.. కార్తీక్ ఘట్టమనేని డిఓపిగా పనిచేయనున్నారు.

megastar-chiranjeevi-latest-video-about-doing-work-outs-in-gym-going-viral-and-announcement-for-mega

ఇప్పుడు లేటెస్ట్ గా అదిరిపోయే అప్డేట్ ఇస్తూ మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసిన వీడియో ఫుల్ ట్రెండింగ్ గా మారింది. అందులో చిరు జిమ్ లో కష్టపడుతూ వర్కవుట్స్ చేస్తుండడం గమనించవచ్చు. 70 ఏళ్ళ వయసులో ఇంకా యంగ్ గా కనిపిస్తూ ఈ రేంజ్ లో కష్టపడటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇదంతా తన నెక్స్ట్ సినిమా కోసమే అంటూ చెప్పుకొచ్చారు. ఆ మూవీ మే 21న ఓపెనింగ్ పూజ కార్యక్రమం జరుపుకుంటుందని అనౌన్స్ చేశారు.

కాగా ఈ మూవీలో హీరోయిన్ గా స్టార్ బ్యూటీని రంగంలోకి దింపేందుకు బాబీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో చిరుకి జోడిగా పలువురు హీరోయిన్ల పేర్లు వినపడగా.. ఇప్పుడు ఏకంగా ప్రపంచ సుందరి పేరు తెరపైకి రావడం హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీలో చిరంజీవికి జంటగా ఐశ్వర్య రాయ్ రాబోతున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఆమె హీరోయిన్‌గా నటిస్తారా? లేక అతిథి పాత్రలో కనిపిస్తారా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

అంతే కాకుండా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. ఇవే డబుల్ బొనాంజా అనుకుంటే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక పవర్‌ఫుల్ క్యామియో రోల్ చేయనున్నట్లు సమాచారం. మోహన్ లాల్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. ఒకే ఫ్రేమ్‌ టాప్ స్టార్ హీరోలను చూడటం అభిమానులకు పెద్ద పండుగగా అనిపిస్తుందని అంటున్నారు. ఈ మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు సినీ వర్గాల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+