బొమ్మ బ్లాక్ బస్టర్.. మెగాస్టార్ "మన శంకర వరప్రసాద్ గారు" రివ్యూ !!

మెగాస్టార్ చిరంజీవి - సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం "మన శంకర వరప్రసాద్ గారు". చిరు కెరీర్‌లో 157వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నారు. ఈ మూవీని చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల, నిర్మాత సాహు గారపాటి తమ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, షైన్ స్క్రీన్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరీలియో సంగీతం సమకూరుస్తున్నారు. అలానే లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. కేథరిన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.

కాగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమాలు ఇప్పటివరకు వరుసగా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాలు సాధించాయి. ఆయన తెరకెక్కించిన చివరి చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. వెంకటేష్ హీరోగా వచ్చిన ఆ మూవీ భారీ హిట్ అందుకుంది. ఏకంగా 300 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టి అందరికీ షాక్ ఇచ్చింది. దాంతో మళ్లీ వీరి కాంబినేషన్ లో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే సెన్సార్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికెట్ (CBFC) రివ్యూ వెల్లడించింది. మరీ ఈ మూవీకి సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది ? రన్‌టైమ్ ఎంత? మూవీ ఎలా ఉందో మీకోసం ప్రత్యేకంగా...

megastar-chiranjeevi-mana-shankara-varaprasad-garu-movie-review-and-rating

సినిమా కథ..

శంకరవరప్రసాద్ (చిరంజీవి) ఇంటెలిజెన్స్ ఆఫీసర్. కేంద్ర మంత్రి దగ్గర సెక్యూరిటీగా ఉంటాడు. అతని భార్య శశిరేఖ (నయనతార) ఇండియాలోనే రిచెస్ట్ బిజినెస్ ఉమెన్. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కానీ చిన్నచిన్న ఈగోలతో విడిపోతారు. తన పిల్లల్ని కూడా చూడలేకపోతున్నాను అని శంకరవరప్రసాద్ బాగా ఫీల్ అవుతుంటాడు. అలాంటి సమయంలో తన టీం నారాయణ (హర్షవర్ధన్), జ్వాల (కేథరిన్ త్రెసా) మరో ఇద్దరితో కలిసి పిల్లలకు దగ్గర ఇవ్వడానికి ఒక ప్లాన్ వేస్తారు. అదే సమయంలో శశిరేఖ తండ్రి మీద అటాక్ జరుగుతుంది. అది ఎవరు చేశారో తెలుసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ శంకర వరప్రసాద్ ను శశిరేఖ ఇంటికి సెక్యూరిటీ ఆఫీసర్ గా పంపిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది.. ఎలా విడిపోయిన భార్యాభర్తలు కలిశారు అనేది మిగిలిన కథ..

మూవీ రివ్యూ..

కథ పరంగా మన శంకరవరప్రసాద్ గారు చాలా రొటీన్ మూవీ. కానీ అనిల్ రావిపూడి సినిమాలలో కథ కంటే ఎక్కువగా కథనం బాగుంటుంది. ఈసారి కూడా నో లాజిక్.. ఓన్లీ వింటేజ్ మెగా మ్యాజిక్ చేయడంలో సక్సెస్ కొట్టారు. ఈ జనరేషన్ దర్శకులలో చిరంజీవిని బాగా వాడుకుంది అనిల్ అని చెప్పొచ్చు. మెగాస్టార్ కామెడీ టైమింగ్ చూసి ఎన్నో ఏళ్లు దాటిపోయింది. మధ్యలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ వచ్చాయి కానీ కామెడీ మాత్రం లేని లోటు ఇప్పుడే అనిల్ తీర్చేశాడు. ఫస్టాఫ్ లోనే ఫుల్ పైసా వసూల్ అయిపోయింది. పంచ్ డైలాగులు, సెల్ఫ్ సెటైర్లు, చిరు మోడ్యులేషన్స్ తో మెప్పించారు.

ఇక చిరంజీవి కూడా ఎంత ఆకలి మీద ఉన్నాడో అని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. జస్ట్ టైం గ్యాప్ అంతే టైమింగ్ లో అస్సలు గ్యాప్ ఉండదని స్క్రీన్ మీద రఫ్ ఆడించాడు. ఒక్కొక్క సీనులో ఫస్టాఫ్ అయితే హిలేరియస్.. సెకండ్ హాఫ్ అక్కడక్కడ కాస్త తగినట్టు అనిపిస్తుంది కానీ చివర్లో వెంకటేష్ వచ్చాక స్క్రీన్ దద్దరిల్లిపోయింది. సింపుల్ గా చెప్పాలంటే శంకరవరప్రసాద్ గా తన ఆకలి మొత్తం తీర్చేసుకున్నాడు బాస్. హుక్ స్టెప్, మెగా విక్టరీ సాంగ్స్ విజువల్ గా అదిరిపోయాయి.

megastar-chiranjeevi-mana-shankara-varaprasad-garu-movie-review-and-rating

నటీనటులు..

మెగాస్టార్ చిరంజీవి నటన గురించి చెప్పేటంతటి వారు ఎవరున్నారు. ఆయనకు ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ దొరికితే మళ్లీ ఎలా స్క్రీన్ మీద నవ్వులు పూయిస్తారో ఇప్పుడు మరోసారి నిరూపించారు.

వెంకటేష్ ఉన్నది 20 నిమిషాలైనా కూడా అదరగొట్టాడు.

నయనతార కూడా చాలా అందంగా ఉంది.

కేథరిన్ త్రెసా, సచిన్ ఖేడ్ కర్, బుల్లి రాజు, అభినవ్ గోమటం, హర్షవర్ధన్ ఎవరికి వాళ్లు తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్..

దర్శకుడు అనిల్ రావిపూడి మరొసారి తన టాలెంట్ నిరూపించుకున్నారు. పాత కథను కూడా తన మార్క్ ఎంటర్టైన్మెంట్ పద్ధతిలో మెప్పించారు.

భీమ్స్ మ్యూజిక్ తో అదరగొట్టారు.

సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీతో మెప్పించారు.

నిర్మాతలు ఎక్కడా తగ్గకుండా పూర్తి స్థాయి న్యాయం చేశారు.

రేటింగ్..

3.25/5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+