థాంక్యూ 'పెదనాన్న'.. చిరంజీవిపై అక్కినేని అఖిల్ ఎమోషనల్ ట్వీట్
అక్కినేని అఖిల్ లెటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'లెనిన్' ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 10 న విడుదలైంది. సెన్సేషనల్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే రూ. 61.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. కేవలం మౌత్ టాక్ తోనే ఈ సినిమా దూసుకెళ్తోంది. అటు అమెరికాలోనూ ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అక్కడ కూడా హాఫ్ మిలియన్ డాలర్ల మార్కును సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కలెక్షన్స్ అఖిల్ కెరీర్ లోనే అత్యధికం అని వివరిస్తున్నాయి. ఇక ఇప్పటికే లెనిన్ మూవీ అనేక ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అయినట్లు తెలుస్తోంది.

అయితే లెనిన్ మూవీపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. లెనిన్ మూవీకి వస్తున్న ఆదరణ చూసి తనకు చాలా సంతోషంగా ఉందని.. అఖిల్ తన కొడుకు లాంటి వాడని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. దీనిపై తాజాగా అక్కినేని అఖిల్ స్పందించారు. పెదనాన్న.. మీరు ఎప్పుడూ చూపే ప్రేమకు పొంగిపోతుంటా.. మీ సపోర్ట్ కు థ్యాంక్స్.. ప్లీజ్ సినిమా చూడండి. త్వరలో మిమ్మల్ని కలుస్తా అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం అఖిల్ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Pedha Nanna …. Your love is always overwhelming. Thank you for all your support ❤️🙏🏻🙏🏻
— Akhil Akkineni (@AkhilAkkineni8) July 13, 2026
Please do watch the film.
See you very soon 🤗 https://t.co/fMUn3hTtOi
అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేస్తూ.. 'లెనిన్ మూవీకి సంబంధించి అద్భుతమైన విషయాలను వింటున్నాను. అఖిల్ నాకు కొడుకులాంటి వాడు. ప్రేక్షకుల నుంచి అఖిల్ కు లభిస్తున్న ఆదరణ, ప్రశంసలు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ప్రతి సినిమాతో అతను నటుడిగా ఎదుగుతుండటం ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ మూవీ విజయంపై నా ఫ్రెండ్ నాగార్జున, మూవీ టీమ్ కు స్పెషల్ విషెస్ తెలియజేస్తున్నాను అని చిరంజీవి తన పోస్టు ద్వారా తెలిపారు. ఈ పోస్టుకు అక్కినేని అఖిల్ స్పందిస్తూ మెగాస్టార్ చిరంజీవిని పెదనాన్న అంటూ సంబోధించడంతో ఇప్పుడు మెగా, అక్కినేని ఫ్యాన్స్ సంబరాల్లో మునిగితేలుతున్నారు. మరోవైపు అక్కినేని అఖిల్ తన తదుపరి చిత్రం ఎవరితో చేయబోతున్నారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications