అల్లు అర్జున్‌తో విభేదాలపై చిరంజీవి సంచలన నిర్ణయం!

కొన్ని దశాబ్దాల నుంచి తెలుగులో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రం చేస్తున్నారు. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తోంది. వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతోంది. యువ హీరోలతో పోటీపడుతూ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్న చిరంజీవి గత చిత్రం భోళాశంకర్ దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. దీంతో విశ్వంభరతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం మెగాస్టార్ కుటుంబ సభ్యులతో కలిసి పారిస్ వెళ్లారు.

కుటుంబానికే పెద్దపీట
అగ్ర కథానాయకుడిగా ఉన్నప్పటికీ, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి వ్యాపారవేత్తగా ఉన్నప్పటికీ చిరంజీవి మొదటి ప్రాధాన్యం మాత్రం కుటుంబానికే ఇస్తారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో కుటుంబానికి, విలువలకు పెద్దపీట వేస్తుంటారు. ప్రస్తుతం మెగా కుటుంబ సభ్యులంతా సినిమాల్లో రాణిస్తుండటంతో వృత్తిలో పడి ఒకరినొకరు కలుసుకోకుండా ఉంటే విభేదాలు వచ్చే అవకాశం ఉందని చిరంజీవి గ్రహించారు. అందుకే కుటుంబ సభ్యులందరినీ కచ్చితంగా నెలలో రెండురోజులపాటు కలవాలనే షరతు విధించారు.

Megastar Chiranjeevi sensational decision on differences with Allu Arjun

నిబంధన అతిక్రమించకూడదు
ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఎవరూ ఈ నిబంధనను అతిక్రమించకూడదు అనేది చిరంజీవి నిబంధన. ఎవరిమధ్య ఎన్నివిధాలుగా గొడవలున్నప్పటికీ కలుసుకున్న తర్వాత వీరంతా మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఇలా మాట్లాడుకోవడంవల్ల విభేదాలన్నీ సమసిపోతాయనేది చిరంజీవి భావన. అందుకు తగ్గట్లుగానే ఆయన కుటుంబ సభ్యులందరితో ఈ షరతును కఠినంగా అమలు చేస్తున్నారు. అందరూ కలుసుకొని ఒకరి కష్టసుఖాలను మరొకరికి చెప్పుకోవాలి. దీనివల్ల వ్యక్తుల మధ్య ఆత్మీయత పెరుగుతుంది. కచ్చితంగా నెలకోసారి అందరూ కలుస్తూ చిన్న చిన్న విభేదాలున్నా మరిచిపోయి సంతోషంగా గడుపుతారు. మెగా కుటుంబ సభ్యులంతా ఆనందంగా ఉండటానికి ఇదే ప్రధాన కారణమని తెలుస్తోంది.

అల్లు అర్జున్ తో కూడా..
అల్లు అర్జున్ తో మెగా కుటుంబానికి గొడవలున్నాయని, వీరిమధ్య దూరం బాగా పెరిగిందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అందులోను ఏపీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు మెగా, అల్లు కుటుంబాల మధ్య దూరాన్ని పెంచాయి. ఈ వివాదానికి కూడా చెక్ పెట్టాలని చిరంజీవి భావిస్తున్నారు. వచ్చే నెలలో మెగా కుటుంబ సభ్యులందరూ.. అంటే అల్లు కుటుంబ సభ్యులు కూడా కలిసి విభేదాలను పరిష్కరించుకునే దిశగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇలా తన కుటుంబ సభ్యులందరి మధ్య సంతోషం వెల్లివిరిసేలా చేస్తున్న చిరంజీవి కఠిన షరతుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+