Chiranjeevi: అప్పుడు కలిగిన ఆనందం ఇప్పుడు లేదు.. పద్మవిభూషణ్ అవార్డుపై చిరు..!
పద్మవిభూషణ్ అవార్డు రావడం ఆనందంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అయితే పద్మభూషణ్ వచ్చినప్పుడు కలిగిన ఆనందం పద్మవిభూషణ్ వచ్చిప్పుడు లేదన్నారు. అవార్డు వచ్చింది సంతోషం, గౌరవంగా స్వీకరించాలని అనుకున్నట్లు చెప్పారు. కానీ గత వారం రోజులుగా చాలా మంది అభినందనలు తెలుపుతుంటే ఉద్వేగానికి గురయినట్లు చిరు చెప్పారు. తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.
పద్మ అవార్డులు వచ్చిన వారికి తెలంగాణ ప్రభుత్వం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఆదివారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో పద్మ అవార్డు గ్రహితలందరిని ప్రభుత్వం సత్కరించింది. మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయడుతో సహా ఆరుగురు పద్మ అవార్డు గ్రహీతలను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సన్మానించారు. అవార్డు గ్రహీతలకు రూ.25లక్షల క్యాష్ రివార్డ్ కూడా అందించారు. ఆ తర్వాత చిరు, వెంకయ్య ఒకరికొకరు సత్కరించుకున్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. పద్మ అవార్డుల గ్రహితలను తెలంగాణ సన్మానించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అవార్డులు ప్రకటించిన వెంటనే ఇలా సన్మానించడం ఇదే తొలిసారని చిరు గుర్తు చేశారు. అవార్డులు కళాకారులకు ఎంతో ప్రొత్సహిస్తాయని చెప్పారు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇవ్వడం మంచి పరిణామమన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి చిరు కృతజ్ఞతలు తెలిపారు.
చిరంజీవి గారికి గౌరవ సన్మానం ❤️
— Congress for Telangana (@Congress4TS) February 4, 2024
Great Honour to Padma Vibhushan #Chiranjeevi garu @revanth_anumula @Bhatti_Mallu @KomatireddyKVR pic.twitter.com/XPJRnh2OuL
చిరంజీవి, వెంకయ్యతో పాటు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, స్థపతి వేళు ఆనందాచారి, బుర్రవీణ కథకుడు దాసరి కొండప్ప, కవి కూరెళ్ల విఠలాచార్య, సంగీత కళాకారుడు కేతావత్ సోమాలాల్, సంగీత నాటక కళాకారిణి ఉమామహేశ్వరిలకు పద్మశ్రీ పురస్కారాలను వచ్చాయి. ఈ కార్యక్రమంలో చిందు యక్షగానం, బుర్రకథలను తెలంగాణ కళకారులు ప్రదర్శించారు. సన్మాన కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురు సినీ ప్రముఖులు వచ్చారు.












Click it and Unblock the Notifications