చిరంజీవికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం..!!

మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గుర్తింపు దక్కింది. చిరంజీవికి యూకే పార్లమెంట్ జీవిత సాఫల్య పురస్కారం అందించాలని నిర్ణయించింది. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ రంగానికి ఆయన అందిస్తోన్న విశేష సేవలను యూకే ప్రభుత్వం గుర్తించింది. ఈ నెల 19న చిరంజీవి ఈ అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. తాజా ప్రకటనతో మెగా ఫ్యాన్స్ అంతా సంబరాల్లో మునిగిపోయారు.

చిరంజీవికి యూకే అవార్డు
ప్రముఖ సినీ హీరో చిరంజీవి కి వరుస అవార్డులు దక్కుతున్నాయి. కేంద్రం పద్మవిభూషణ్ తో సత్కరించగా.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మరో గౌరవం దక్కింది. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో అందిస్తున్న సేవలను గుర్తించిన యూకే ప్రభుత్వం ఆయనకు లైఫ్‌టైమ్‌ అచీవ్‌ మెంట్‌ అవార్డు ప్రకటించింది. సినీ రంగంలో చిరంజీవి అందిస్తున్న సేవలకు అవార్డు అందించనున్నట్లు తెలిపింది. మార్చి 19న యూకే పార్లమెంటులో ఈ అవార్డును చిరుకు అందజేయనున్నట్లు ప్రకటించారు.

Megastar Chiranjeevi will be honored at the UK Parliament s House with Lifetime Achievement Award

ప్రజా జీవితంలోనూ
సినీ రంగంలో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన చిరంజీవి సామాజిక సేవలోనూ ముందు వరుసలో నిలిచారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. 155 పైగా నటించిన చిరంజీవి రాజకీయ రంగం లోనూ ప్రవేశించారు. ప్రజారాజ్యం ఏర్పాటు..ఆ తరువాత కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. ప్రస్తుతం రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. కొద్ది కాలంగా చిరంజీవి తిరిగి రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారానికి ముగింపు పలికారు. తమ్ముడు పవన్ సక్సెస్ గురించి చిరంజీవి పలు సందర్భాల్లో సంతోషం వ్యక్తం చేసారు. ఇప్పుడు పెద్ద తమ్ముడు నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. త్వరలో ఏపీ మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.

మెగా ఫ్యాన్స్ ఖుషీ
ఇక, ఇప్పుడు చిరంజీవికి యూకే ప్రభుత్వం ప్రకటించిన లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటు జనసేన ఆవిర్భావ దినోత్సవ వేళ ఈ ప్రకటన మెగా ఫ్యాన్స్ లో జోష్ పెంచింది. చిరంజీవి ప్ర‌స్తుతం విశ్వంభ‌ర చిత్రంలో న‌టిస్తున్నారు. సోషియో ఫాంట‌సీ జాన‌ర్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. వ‌శిష్ఠ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. త్రిష, ఆశికా రంగనాథ్ హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. చిరంజీవి విశ్వంభర మూవీ తర్వాత అనిల్ రావిపూడితో కామెడీ సినిమా, ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో మాస్ సినిమా చేయబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+