అక్కాచెల్లెళ్లయిన ముగ్గురు హీరోయిన్లతో హిట్స్ అందుకున్న ఏకైక హీరో ఆయనే..?

చిత్ర పరిశ్రమలో ఒకే కుటుంబం నుంచి వచ్చిన వారు ఎంతో మంది ఉన్నారు. ఎక్కువగా ఈ తరహా ధోరణి మగవారిలోనే చూస్తుంటాం. అయితే స్త్రీ లలో కూడా ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చి రాణించిన వారు ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు ముగ్గురు సినిమాల్లోకి రావడం ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ అలా వచ్చిన ముగ్గురు హీరోయిన్స్ తో కూడా నటించి, హిట్ కొట్టిన ఏకైక హీరో మాత్రం ఒక్కరే ఉన్నారు. ఆ స్టోరీ ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

ముందుగా ఆ అక్కాచెల్లెళ్లు ఎవరంటే.. నగ్మా, జ్యోతిక, రోషిణి. ప్రముఖ నటి నగ్మా గురించి అందరికీ తెలిసిందే. తన అందంతో, నటనతో పలు భాషలలో కూడా అవకాశాలు అందుకుంది. స్టార్ హీరోలందరి సరసన నటించిన నగ్మా.. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఇప్పటి వరకు వివాహాం చేసుకోకుండా.. సింగిల్‌గానే ఉంది. అంతకు ముందు ఈమె శరత్ కుమార్‌తో పాటు మాజీ బీసీసీఐ అద్యక్షుడు సౌరబ్ గంగూలితో డేటింగ్‌ చేసి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తూ బిజీగా ఉంది.

megastar-chiranjeevi-worked-with-three-sisters-in-films-and-got-block-busters

జోతిక సైతం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసింది. చంద్రముఖి అంటే తెలుగు ప్రేక్షకులకు జ్యోతికనే అని చెప్పాలి. అంతలా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యారు. ప్రముఖ తమిళ నటుడు సూర్యను ఆమె లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన జ్యోతిక.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతూ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇక రోషిణి సైతం తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఆమె తెలుగులో నటించింది కేవలం రెండు సినిమాలే అయినప్పటికీ తనదైన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. ఇక ఈ ముగ్గురు సిస్టర్స్ తో నటించి హిట్ అందుకున్న ఏకైక హీరో అంటే మెగాస్టార్ చిరంజీవి అనే చెప్పాలి.

ముగ్గురు తోనూ హిట్ సినిమాలు..

మెగాస్టార్ చిరంజీవి ఈ ముగ్గురు సిస్టర్స్ తి నటించి బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ముందుగా నగ్మాతో ఘరానా మొగుడు, రిక్షావోడు, ముగ్గురు మొనగాళ్లు సినిమాల్లో నటించారు. ఘరానా మొగుడు, రిక్షావోడు చిత్రాలు మంచి హిట్ సాధించాయి. అలానే జ్యోతికతో వివి వినాయక దర్శకత్వంలో ఠాగూర్ చిత్రం చేశారు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. అంతే కాకుండా రోషినితో కలిసి మాస్టర్ సినిమాలో నటించారు మెగాస్టార్. ఈ సినిమా సైతం ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకోగలిగింది. దీంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లతో హిట్స్ కొట్టిన ఏకైక హీరోగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి.

megastar-chiranjeevi-worked-with-three-sisters-in-films-and-got-block-busters

మరోవైపు మెగాస్టార్‌ ప్రస్తుతం బింబిసారా డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' మూవీ చేస్తున్నారు. ముగింపు దశకు చేరుకున్న ఈ మూవీ ఈ ఏడాదిలోనే సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రంలో త్రిష, అషికా రంగనాథ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్లు, వీడియోలు ఆడియన్స్ లో భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.

అలానే అనిల్ రావిపూడితో కూడా ఒక సినిమాకు కమిట్ అయ్యారు చిరంజీవి. రీసెంట్ గానే ఉగాది పర్వదినం సందర్భంగా పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందనున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని టాక్ నడుస్తోంది.

ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణిస్తున్న సిస్టర్స్..

సినీ పరిశ్రమలో రాణిస్తున్న సిస్టర్స్ జాబితా చూస్తే పెద్ద లిస్టే ఉంటుంది. నేటి తరం కథానాయికల్లో గమనిస్తే కాజల్ అగర్వాల్, నిషా అగర్వాల్ తెలుగులో హీరోయిన్స్ గా రాణించారు. ఆర్తి అగర్వాల్ - అదితి అగర్వాల్.. సంజన - నిక్కీ గల్రానీ.. షాలినీ - శామిలి.. శిల్పా శిరోద్కర్ - నమ్రత శిరోద్కర్.. పూజా భట్ - ఆలియా భట్.. జాన్వీ కపూర్ - ఖుషీ కపూర్.. కరిష్మా కపూర్ - కరీనా కపూర్.. కృతి సనన్ - నుపూర్ సనన్.. నేహా శర్మ - ఐషా శర్ ఇలా పెద్ద జాబితా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+