మెగాస్టార్ సినిమాలో నారా వారి హీరో..?
మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే ఓ సెలబ్రేషన్.. తెలుగు రాష్ట్రాల్లో ఓ పండగ వాతావరణం.. సాధారణంగా ఏ హీరోకు వారి ఫ్యాన్స్ సెపరేట్ గా ఉంటారు. కానీ అందరి హీరోల ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకునేది ఒక్క చిరంజీవి సినిమాకే.. ఈ ఏడాది మన శంకర వరప్రసాద్ గారు మూవీతో బ్లాక్ బస్టర్ విజయ్ అందుకున్నారు చిరంజీవి. మెగాస్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఈ మూవీ నిలిచింది. అంతేకాక చిరు కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగానూ మన శంకర వర ప్రసాద్ నిలిచింది. దాంతో చిరంజీవి తరువాతి చిత్రంపై ఇప్పుడు అటు మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ సినీ ప్రేక్షకుడు సైతం అంచనాలు పెట్టుకున్నాడు.
ఇక బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తన 158 వ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పూజా కార్యక్రమం ఇటీవల అట్టహాసంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో మెగా బ్రదర్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టి ప్రారంభించారు.
చిరంజీవి- బాబీ కెరీర్ లో 2023 లో వచ్చిన వాల్తేర్ వీరయ్య మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. మరోసారి ఈ క్రేజీ కాంబో రిపీట్ కానున్న నేపథ్యంలో అంచనాలు భారీగా నెలకున్నాయి. అయితే ఈ మూవీలో ఓ కీలక పాత్రలో నారా వారి హీరో నారా రోహిత్ నటించనున్నట్లు ఫిలిం నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఈ సినిమాలో సెకండాఫ్ లో వచ్చే ఇంపార్టెంట్ రోల్ కోసం పలువురు హీరోల పేర్లు పరిశీలించిన దర్శకుడు బాబీ.. చివరకు నారా రోహిత్ ను లాక్ చేసినట్టు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇక యంగ్ హీరోయిన్ అనశ్వర రాజన్ ఈ మూవీలో చిరంజీవి కుమార్తెగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కే నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.












Click it and Unblock the Notifications