సిస్టర్స్ సెంటిమెంట్‌తో రాబోతున్న మెగాస్టార్ విశ్వంభర.
Ambani News: ఆసియాలో సంపన్న వ్యాపారవేత్తగా కొనసాగుతున్న ముఖేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ. ఒకప్పుడు ఈ వ్యాపావేత్త బిలియనీర్ల జాబితాలో ఉండేవాడు. ఈ వ్యాపారవేత్త సంపదలు కోల్పోయి ప్రస్తుతం సాధారణ వ్యక్తిలా మారిపోయారు.
వాస్తవానికి పతనం తర్వాత బయటి కార్యక్రమాల్లో సైతం అనిల్ అంబానీ పెద్దగా కనిపించటం లేదు. ఈ క్రమంలోనే తాజాగా దిల్లీ హైకోర్టు ఆదేశాలు అంబానీని మరిన్ని సమస్యల్లోకి నెట్టేసింది. అనిల్ అంబానీ తన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి చెందిన రూ.1,100 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించడం లేదా బదిలీ చేయడం లేదా తాకట్టు పెట్టడంపై దిల్లీ హైకోర్టు నిషేధం విధించింది.

వాస్తవానికి 2008లో చైనా కంపెనీ షాంఘై ఎలక్ట్రిక్ గ్రూప్, అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మధ్య సాసన్ పవర్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పరికరాలను సరఫరా చేసేందుకు ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు షాంఘై ఎలక్ట్రిక్ గ్రూప్ రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దావా వేసింది. దీంతో షాంఘై కంపెనీకి 146 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని అనిల్ అంబానీ కంపెనీని సింగపూర్ కోర్టు ఆదేశించింది.
2022లో సింగపూర్ కోర్టు తీర్పుకు అనుగుణంగా మధ్యంతర ఉపశమనంగా మొత్తాన్ని అందించాలని కోరుతూ షాంఘై కంపెనీ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారించారు. ఇందులో కంపెనీ అభ్యర్థనను అంగీకరించడానికి షాంఘై నిరాకరించింది. ఈ నేపథ్యంలో షాంఘై కంపెనీ దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించిన దిల్లీ హైకోర్టు.. అనిల్ అంబానీ కంపెనీ రూ.1,100 కోట్లకు పైగా ఆస్తులను భద్రంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. వీటి అమ్మకం, బదిలీని కోర్టు తాజాగా నిషేధించింది. ఇది సమస్య పరిష్కారాన్ని మరింత జఠిలం చేస్తుందని అనిల్ అంబానీ వర్గం ఆందోళన చెందుతోంది.
అనిల్ అంబానీ మరియు ముఖేష్ అంబానీ భారతదేశంలో రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన ధీరూభాయ్ అంబానీ కుమారులు. అనిల్ అంబానీ కూడా ఒకప్పుడు దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తగా ప్రభావం చూపారు. అప్పట్లో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో అనిల్ అంబానీ ఆరో స్థానంలో నిలిచారు. అనిల్ నికర విలువ రూ.1.83 లక్షల కోట్లుగా ఉండేది. అయితే ఆ మహా వ్యాపార సామ్రాజ్యం అప్పుల ఊబిలో కూరుకుపోవటంతో కొన్నేళ్ల కిందట వ్యాపారవేత్త అనిల్ అంబానీ దివాలా తీశారు.












Click it and Unblock the Notifications