మందు బాటిల్‌తో మెగా హీరోయిన్ ..ఎంజాయ్ అంటూ రచ్చ
టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో మెహ్రీన్ ఫిర్జాదా కూడా ఒకరు. ''కృష్ణగాడి వీర ప్రేమగాథ'' సినిమాతో మెహ్రీన్ ఫిర్జాదా తెలుగులో హీరోయిన్‌గా పరిచియమైంది. తన తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది ఈ భామ. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం , అభినయంతో ఆకట్టుకున్న మెహ్రీన్ తెలుగులో టాప్ హీరోయిన్‌గా నిలుస్తుందని అంతా భావించారు.
"మహానుభావుడు,"రాజా ది గ్రేట్," "F2", "F3" వంటి సూపర్ హిట్ సినిమాలు మెహ్రీన్ ఖాతాలో ఉన్నాయి. అయితే వరుస ఫ్లాపులు రావడంతో అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా పడిపోయింది. 'జవాన్', 'కవచం', 'ఎంత మంచివాడవురా', 'అశ్వత్థామ', 'మంచి రోజులు వచ్చాయి',వంటి సినిమాలు మెహ్రీన్‌ను రేసు నుంచి వెనక్కి లాగేశాయి. దీంతో మెహ్రీన్‌కు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. రష్మిక, పూజా హెగ్డె వంటి హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడంతో మెహ్రీన్‌ను దర్శక-నిర్మాతలు పక్కన పెట్టేశారు.

ఇదే సమయంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో మెహ్రీన్ ప్రేమలో ఉన్నారనే వార్తలొచ్చాయి. అయితే ఇవన్నీ కూడా పుకార్లే అని తేలిపోయాయి. ఆ తర్వాత తిరిగి సినిమాల్లో నటించాలని ప్రయత్నించినప్పటికీ అంతగా వర్క్ అవుట్ కాలేదు. మెహ్రీన్ చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు. ఇదిలా ఉంటే ఈ భామ తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో రెడ్ కలర్ డ్రెస్‌లో హాట్ లుక్స్‌తో ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. అయితే మెహ్రీన్ వెనుక వైన్ బాటిల్స్ దర్శనం ఇచ్చాయి. దీంతో ఇది చూసిన నెటిజన్లు న్యూ ఇయర్ వేడుకులకు ఇలా రెడీ అవుతున్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications