మనకెందుకు అన్నాయ్ పాన్ ఇండియా సినిమాలు..!!

డాన్స్ అనగానే మనకు గుర్తొచ్చేది మైఖేల్ జాక్సన్. తన డాన్స్ తో పాప్ ప్రపంచానికి రారాజుగా నిలిచాడు మైఖేల్ జాక్స‌న్. అయితే ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం మైఖేల్.. ఈ మూవీలో మైఖేల్ జాక్సన్ మేనల్లుడు అయిన జాఫర్ జాక్సన్ ప్రధాన పాత్రలో నటించడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అలాగే పాన్ ఇండియా స్థాయిలో ఏప్రిల్ 24 న రిలీజైంది. ఈ చిత్రానికి ఆంటోనీ ఫుక్వా దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో మైఖేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ పరకాయ ప్రవేశం చేశాడనే చెప్పాలి. ఆయన బాడీ లాంగ్వేజ్, ఐకానిక్ మూమెంట్స్, స్టేజీపైన ఎనర్జీని చూస్తుంటే వావ్ అనాల్సిందే.

ఇక ఈ మూవీ విడుదలకు మందు ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ప్రోమోలు, పాటలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ పాపులర్ అయ్యాయి. జాఫర్ జాక్సన్ కు స్వయంగా మైఖేల్ జాక్సన్ తో రక్త సంబంధం ఉన్న కారణంగా స్వయంగా ఆయనే కిందకు దిగి వచ్చినట్లుగా జాఫర్ జాక్సన్ మాయ చేశాడు. ఇక ఏప్రిల్ 24 ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఐమాక్స్ లాంటి పెద్ద పెద్ద స్క్రీన్స్ లో ఈ చిత్రాన్ని చూస్తున్నప్పుడు మైఖేల్ జాక్సన్ మన ముందుకు వచ్చి లైవ్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నట్టుగా అనిపిస్తోందని సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మైఖేల్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి కానీ.. ఇండియా వైడ్ గా మాత్రం గొప్ప ఓపెనింగ్స్ దక్కలేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Michael Jackson Biopic Sees Low Opening Collections in India on FirstDay at the Box Office Michael

మైఖేల్ మూవీకి భారత్ లోని అన్ని ప్రాంతీయ భాషలు కలిపి కేవలం రూ. 7 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చినట్లు సమాచారం. అయితే నార్త్ అమెరికాలో మాత్రం ఈ మూవీకి మొదటి రోజున 40 మిలియన్ డాలర్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే కేవలం నార్త్ అమెరికాలోనే వీకెండ్ ముగిసే సమయానికి 90 మిలియన్ డాలర్లు గ్రాస్ వస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక మైఖేల్ మూవీ ఫుల్ రన్ లో 1 బిలియన్ డాలర్ల గ్రాస్ ని రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరోవైపు మైఖేల్ మూవీ రెండో పార్ట్ కూడా ఉంటుందని సమాచారం. రెండో భాగాన్ని 2028 ఏప్రిల్‌ లో విడుదల చేసే అవకాశముందని సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారంలో ఉంది. అయితే ఈ విషయాలపై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+