వామ్మో.. 'అవతార్' రికార్డ్స్ నూ ఊదేశావ్ ఏంటన్నా..?
ఎంత పెద్ద హీరోకు అయినా ఓ పరిధి ఉంటుంది. అయితే అతికొద్ది మంది సెలబ్రిటీస్ మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ను ఏర్పాటుచేసుకున్నారు. వారిలో టాప్ ప్లేస్ లో ఉంటాడు మైఖేల్ జాక్సన్.. డాన్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ఆయనే.. తన డాన్స్ తో పాప్ ప్రపంచానికి రారాజుగా వెలిగాడు మైఖేల్ జాక్సన్. అయితే ఆయన లైఫ్ కు తెరపైకి తీసుకొచ్చిన సినిమానే 'మైఖేల్'.. ఈ మూవీలో మైఖేల్ జాక్సన్ పాత్రలో ఆయన మేనల్లుడు అయిన జాఫర్ జాక్సన్ నటించడంతో ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అందుకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ప్రభంజనం సృష్టిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా భారీ హిట్టు కొట్టిన అవతార్, ఎవెంజర్స్ మూవీస్ ను కూడా దాటేసి కలెక్షన్స్ లో దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి ఆంటోనీ ఫుక్వా దర్శకత్వం వహించాడు. మైఖేల్ మూవీలో జాఫర్ జాక్సన్ నటన అందరినీ కట్టిపడేస్తుంది. నిజంగానే మైఖేల్ జాక్సన్ మన ముందుకు వచ్చాడా.. అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈమేరకు మైఖేల్ జాక్సన్ పాత్రలో జాఫర్ జాక్సన్ పరకాయ ప్రవేశం చేశాడనే చెప్పాలి. మూవీలో జాఫర్ జాక్సన్ బాడీ లాంగ్వేజ్, ఐకానిక్ మూమెంట్స్, స్టేజీపైన ఎనర్జీని చూస్తుంటే మైఖేల్ జాక్సన్ మళ్లీ పుట్టాడా.. అన్న ఫీలింగ్ కలుగుతుంది.
ఇక మైఖేల్ మూవీని ఏప్రిల్ 24 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల చేయగా రికార్డు కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. తొలిరోజు నెగటివ్ రివ్యూస్ వచ్చినా క్రమంగా ఈ మూవీకి వసూల్లు పెరుగుతున్నాయి. మైఖేల్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా అంటే నార్త్ అమెరికా మార్కెట్ నుండి దాదాపుగా 97 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూల్లు వచ్చినట్లు సమాచారం. అంటే ఇక్కడ అవతార్ 3 ను దాటేసింది మైఖేల్ మూవీ. ఇది మామూలు రికార్డు కాదు.

ఇక ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో అయితే ఈ చిత్రానికి ఇప్పటివరకు 120 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూల్లు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే ఓవరాల్ గా మొదటి మూడు రోజులకు కలిపి ఈ చిత్రానికి 217 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చిందని ట్రేడ్ విశ్లేషకులు లెక్కలు వేసుకుంటున్నారు అంటే మన భారత కరెన్సీ లో చూస్తే దాదాపు రూ. 2వేల కోట్లకు పైగానే అన్నమాట. ఈ రేంజ్ వసూల్లతో మైఖేల్ మూవీ ఇంకా ఎన్ని రికార్డులు బద్ధలు కొడుతుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications