మంత్రి మల్లారెడ్డికి స్ఫూర్తినిచ్చిన మహేష్ బాబు సినిమా: 10 సార్లు ఆ సినిమా చూశా
ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న బాలీవుడ్ మూవీ.. యానిమల్ (Animal). రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించారు. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకుడు. స్టార్ హీరో బాబీ డియోల్ ఇందులో విలన్ క్యారెక్టర్‌ను పోషించారు.
అనిల్ కపూర్, శక్తి కపూర్, సురేష్ ఒబెరాయ్, బబ్లు పృథ్విరాజ్.. కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా నిర్మాణ వ్యయం వంద కోట్ల రూపాయల పైమాటే. ఈ భారీ బడ్జెట్ సినిమాను టీ-సిరీస్, భద్రకాలి పిక్చర్స్, సినీ 1 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. డిసెంబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందీ పాన్ ఇండియా మూవీ.

ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్సే కోట్ల రూపాయలకు చేరాయంటే మాటలు కాదు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్.. సోమవారం రాత్రి హైదరాబాద్ శివార్లలోని మల్లారెడ్డి యూనివర్శిటీలో ముగిసింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌలి, తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.
ఈ మూవీ ట్రైలర్ అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు మహేష్ బాబు. రణ్‌బీర్ కపూర్‌ను తాను పెద్ద ఫ్యాన్ అని, ఇందులో అతని బాడీ లాంగ్వేజ్ పూర్తిగా ఛేంజ్ అయిందని చెప్పాడు. ఓ మంచి యాక్షన్ ఎంటర్‌టైన్మెంట్‌ను డిసెంబర్ 1వ తేదీన తామందరం చూడబోతోన్నామని అన్నాడు.

ఈ ఈవెంట్‌లో మంత్రి మల్లారెడ్డి ఇచ్చిన స్పీచ్ మహేష్ బాబు ఫ్యాన్స్‌లో జోష్ నింపింది. మహేష్‌ను ఆయన ఆకాశానికెత్తేశారు. మహేష్ సినిమాలు తనకు స్ఫూర్తినిచ్చాయని చెప్పారు. ప్రత్యేకించి- బిజినెస్‌మెన్ సినిమా గురించి తన ప్రసంగంలో ప్రస్తావించారు మల్లారెడ్డి.
బిజినెస్‌మెన్ సినిమా చూసే తాను రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. ఆ సినిమా చూసిన తరువాతే ఎంపీనయ్యానని అన్నారు. 10 సార్లు బిజినెస్‌మెన్ చూశానని, సేమ్ సిస్టమ్, సేమ్ మోడల్‌ను అమలు చేశానని అన్నారు.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
'పెద్ది' సినిమా వాయిదా..? నిర్మాత సంచలన ప్రకటన.. -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications