'మిరాయ్' నటుడు కన్నుమూత

ప్రముఖ నేపాల్ నటుడు సునీల్ థాపా(68) కన్నుమూశారు. శనివారం(ఫిబ్రవరి 7) ఉదయం ఖాట్మండులోని థాపాతలిలో ఉన్న నార్విక్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

హఠాన్మరణం.. గుండెపోటే కారణం?
సునీల్ థాపా ఆరోగ్య పరిస్థితి శనివారం ఉదయం హఠాత్తుగా క్షీణించడంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరుకునే సరికే ఆయన స్పృహ కోల్పోయారని, ఉదయం 7:44 గంటలకు నిర్వహించిన ఈసీజీ (ECG)లో ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రాథమికంగా గుండెపోటు కారణంగానే ఆయన మరణించినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు.

Mirai Actor Sunil Thapa Passes Away at 68 A Look at the Legend s 40-Year Film Career Known for Mary Kom

నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానం
నేపాల్‌లోని డాంగ్‌లో జన్మించిన సునీల్ థాపా, సుమారు 40 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగారు. 1981లో కమల్ హాసన్ నటించిన క్లాసిక్ చిత్రం 'ఏక్ దూజే కేలియే' ద్వారా హిందీ తెరపైకి అడుగుపెట్టారు. ప్రియాంక చోప్రా నటించిన 'మేరీ కోమ్' చిత్రంలో నర్జిత్ సింగ్ (కోచ్) పాత్ర ఆయనకు దేశవ్యాప్త గుర్తింపునిచ్చింది. ఈ పాత్రకు గాను ఆయన ఫిలింఫేర్ అవార్డుకు కూడా నామినేట్ అయ్యారు.'నసీబ్‌వాలా', 'మానవ హత్య' వంటి చిత్రాలతో పాటు, ప్రసిద్ధ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్'లో కూడా ఆయన నటించారు. ఇటీవల విడుదలైన పాన్-ఇండియా చిత్రం 'మిరాయ్'లోనూ ఆయన కనిపించారు.

నేపాలీ సినిమాకు 'రేటే కైలా'
సునీల్ థాపా నేపాలీ చిత్రసీమలో దిగ్గజ నటుడు. ఆయన 300కు పైగా నేపాలీ చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా 'చినో' అనే చిత్రంలో ఆయన పోషించిన 'రేటే కైలా' అనే విలన్ పాత్ర నేపాలీ సినిమా చరిత్రలో ఒక ఐకానిక్ పాత్రగా నిలిచిపోయింది. విలన్ పాత్రలకు సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చారని ఆయనను ప్రశంసిస్తారు.

నివాళులు
సునీల్ థాపా మరణం పట్ల నేపాల్ తాత్కాలిక ప్రధాన మంత్రి సుశీల కార్కీ సంతాపం వ్యక్తం చేశారు. "గత నాలుగు దశాబ్దాలుగా కళారంగానికి ఆయన చేసిన కృషి అమోఘం. రాబోయే తరాల కళాకారులకు ఆయన ప్రస్థానం ఒక స్ఫూర్తి" అని ఆమె కొనియాడారు. కేవలం నటుడిగానే కాకుండా, ఎవరెస్ట్ ఫిల్మ్ అకాడమీ ఛైర్మన్‌గా ఆయన ఎంతో మంది వర్ధమాన నటులకు మార్గదర్శకత్వం వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+