హిట్ కాంబినేషన్‌లో మరో సాంగ్.. క్యూట్ లవ్ స్టోరీకి ఎమోషనల్ థ్రిల్!
తెలుగులో వస్తున్న సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'మిస్సింగ్ మేఘన'. ఫస్ట్ కాపీ మూవీస్, కేడి అండ్ కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు నిర్మాతగా, వాచస్పతి దర్శకత్వంలో వస్తున్న మిస్సింగ్ మేఘన సినిమాలోని రెండో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు లాంచ్ చేశారు. అలాగే లిరిక్స్ , మ్యూజిక్ బాగున్నాయి.. సినిమా కూడా హిట్ అవుతుందని దిల్ రాజు అభినందించారు.
రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులు ముందుకు వస్తున్న చిత్రం మిస్సింగ్ మేఘన. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్ లాంచ్ సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్ గారి చేతుల మీదుగా జరగగా ... తరువాత సినిమా నుంచి ఫస్ట్"సింగిల్ పిల్ల పిల్ల పిల్ల లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదుగా లాంచ్ అయ్యింది. అలాగే 2 వ పాట ను నిర్మాత దిల్ రాజు గారు రిలీజ్ చేశారు...శామ్. కె. నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఈ చిత్రానికి ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందించారు.

దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ .. ఎంతో మంది కొత్త వాళ్ళకు అవకాలు ఇచ్చి పెద్ద పెద్ద దర్శకులను చేసిన దిల్ రాజు చేతుల మీదు రెండో లిరికల్ సాంగ్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. తమ పాటలకు, టీజర్ కు డిజిటల్ వేదికలపై ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని వెల్లడించారు. ఇది ఓ క్యూట్ లవ్ స్టోరీతో పాటు మంచి ఎమోషనల్ థ్రిల్లర్ అని, ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కడా మిస్ కాకుండా జాగ్రత్తపడ్డామని చెప్పారు. పాటలు, టీజర్ కంటే సినిమా మరింత బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ మాట్లాడుతూ.. మ్యూజిక్ లో మంచి అభిరుచి ఉన్న దిల్ రాజు తమ పాట విని మెచ్చుకోవడం పెద్ద బూస్ట్ ఇచ్చిందని.. తాను స్వరపరిచిన పాటను ఆయన లాంచ్ చేయడం చాలా ప్రత్యేకమైనదని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ.. ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన దిల్ రాజు చేతుల మీదుగా సాంగ్ లాంచ్ అవ్వడం గర్వంగా ఉందన్నారు. ఆయన దీవించినట్లే సినిమా కూడా చాలా బాగా వచ్చిందని.. ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.














Click it and Unblock the Notifications