బిగ్ బాస్ షోకి దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురి..!
తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో 'బిగ్‌బాస్' మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విజయవంతంగా ఎనిమిది సీజన్‌లను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో కోసం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి సామాన్య ప్రజలకు అవకాశాలు కల్పిస్తూ.. ఈసారి అగ్నిపరీక్ష అనేది మొదలు పెట్టారు. అందుకే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించే కంటెస్టెంట్లను ఎంపిక చేసే పనిలో బిగ్‌బాస్ టీమ్ ఉంది.
ఈ క్రమంలోనే సీజన్ 8 కంటే ఈసారి షోలో చాలా మార్పులు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఎప్పటిలాగే సీరియల్, సినీ తారలతో పాటు, సామాన్యులను కూడా తీసుకువస్తున్నారు. అలానే ప్రముఖులు జాబితాలో ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి ఒక ట్రెండింగ్ జంట ఎంట్రీ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవలి కాలంలో సెన్సేషన్‌గా మారిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి ఈ సీజన్‌లో జంటగా అడుగుపెట్టనున్నారని జోరుగా టాక్ నడుస్తోంది.

ఏపీ పాలిటిక్స్ ల్ లో సెన్సేషన్ గా మారారు దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురి. దువ్వాడ ఫ్యామిలీలో వివాదాల కారణంగా దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురి రిలేషన్ బయట పడింది. ఆ తర్వాత పలు నాటకీయ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇక నాటి నుంచి ఈ జంట పలు కార్యక్రమాల్లోనూ, ఇంటర్వ్యూల లోనూ కలిసి పాల్గొంటున్నారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ రీల్స్, వీడియోస్ చేస్తూ వస్తున్నారు.
ఇక బిగ్ బాస్ కి గతంలో కూడా కొన్ని జంటలు, కుటుంబ సభ్యులు కలిసి పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. ఈ మేరకు దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి లకు ఉన్న మీడియా క్రేజ్, వారి వ్యక్తిగత జీవితంపై ప్రజల్లో ఉన్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని.. బిగ్‌బాస్ టీమ్ వారిని హౌస్‌లోకి ఆహ్వానించి ఉంటుందని భావిస్తున్నారు. ఈ జంట హౌస్‌లోకి అడుగుపెడితే టీఆర్పీ రేటింగ్‌లు పెరిగే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. అయితే వీరి ఎంట్రీపై అధికారిక ధృవీకరణ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ జాబితా త్వరలోనే బయటికి వచ్చే అవకాశం ఉంది.
ఈ సీజన్‌లో 'డబుల్ హౌస్' అనే వినూత్న కాన్సెప్ట్ తీసుకు వస్తున్నారు. ఈ మార్పులు, కొత్త రూల్స్, అనుకోని ట్విస్ట్‌లతో షో మరింత ఉత్కంఠభరితంగా, వినోదభరితంగా సాగనుందని బిగ్‌బాస్ టీమ్ చెబుతోంది. త్వరలోనే ఈ సీజన్ ప్రసార తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. మొత్తం మీద ఈ సారి బిగ్‌బాస్ సీజన్ 9 - పాత సిలబస్ కాదని, కొత్త ఎగ్జామ్‌తో వస్తోందని, రణరంగం లాంటి ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని నాగార్జున హామీ ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications