మోహన్ బాబు ఆస్తులకు సౌందర్యకు లింకేంటి..?
మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు తారస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్ మధ్య ఆస్తి తగదాలు ఏర్పడ్డాయి. దీంతో జలపల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. దీంతో మోహన్ బాబు ఇంటివద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.
మనోజ్ తన భార్యతో భూమా మౌనికతో కలిసి మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, అక్కడున్న సిబ్బంది ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఇరు వర్గాలు కూడా ఘర్షణకు దిగారు. ఈ సమయంలో అక్కడకు వచ్చిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరిణామానికి ముందు మోహన్ బాబు తన కొడుకు మంచు మనోజ్‌ను ఉద్దేశించి ఓ ఆడియోను విడుదల చేశారు. ఆస్తి వాటాల విషయంలో మనోజ్, మోహన్ బాబుల మధ్య వివాదం చెలరేగినట్టు తెలుస్తోంది.

ఇదే సమయంలో మనోజ్ తన భార్య భూమా మౌనిక మాటలు వినే ఇదింతా కూడా చేస్తున్నారని మోహన్ బాబు ఆరోపించారు. ఇదిలా ఉంటే అసలు మోహన్ బాబు, ఆయన తనయుడు గొడవ పడుతున్న ఆస్తులు దివంగత హీరోయిన సౌందర్యవని తెలుస్తోంది. జలపల్లిలో మోహన్ బాబు ఉంటున్న ఇల్లు ఒకప్పుడు సౌందర్యది.హీరోయిన్‌గా బిజీగా ఉన్న టైమ్‌లో సౌందర్య భాగా సంపాదించింది. ఆ సంపాదనతోనే ఇక్కడ భూమి కొనుగోలు చేసి, భారీ బంగ్లాను కట్టించింది. దీని విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. సౌందర్య మరణం తర్వాత ఆ బంగ్లాను తక్కువ ధరకే మోహన్ బాబు కొనుగొలు చేశారు. ఇప్పుడు ఆ ఇల్లు విషయంలోనే మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు ఏర్పడ్డాయి. మరి ఈ వివాదం ఎక్కడకు వరకు వెళ్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications