చంద్రబాబుకు 'బిస్కెట్లు' వేస్తున్న మోహన్ బాబు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మన భాషలో చెప్పాలంటే బిస్కెట్లు వేస్తున్నారని చెప్పొచ్చు. 2019 ఎన్నికలకు ముందు తమ విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ చెల్లించడంలేదంటూ రోడ్డెక్కి ధర్నా చేశారు. చంద్రబాబుపై, ఆయన పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ సమయంలో వైఎస్ జగన్ కు ఈ వ్యవహారం కూడా కలిసివచ్చింది. తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయ్యారు.. అలీ, పోసాని, పృథ్వీలాంటివారికి పదవులు వచ్చాయికానీ మోహన్ బాబువైపు జగన్ కన్నెత్తి కూడా చూడలేదు.

చంద్రబాబు తేలిగ్గా తీసుకుంటారు
కాలం గడిచింది.. 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబును మోహన్ బాబు కలిశారు. తన కుమారుడు మనోజ్ భూమా మౌనికను వివాహం చేసుకుంటానంటున్నాడని చెప్పారు. భూమా నాగిరెడ్డి కుమార్తె కాబట్టి చంద్రబాబు సలహా తీసుకోవడానికి, వివాహానికి సంబంధించిన విషయాలను అన్ని కోణాల్లో చర్చించేందుకు కలిశారు. స్వతహాగా చంద్రబాబునాయుడు సహజమైన రాజకీయ నాయకుడు. ఎవరెన్ని మాటలు అన్నా, అవి వ్యక్తిగతంగా అన్నా, రాజకీయ కోణంలో అన్నా వాటిని పట్టించుకోరు. తేలిగ్గా తీసుకుంటారు. అలా తీసుకుంటారు కాబట్టే మోహన్ బాబుతో చర్చించారు.

Mohan Babu praised andhra pradesh cm Chandrababu behind the reason

బాబుపై అభ్యంతరకర వ్యాఖ్యలు
ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తామిద్దరం స్నేహితులమని, కానీ ఆ స్నేహాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశాడంటూ మోహన్ బాబు తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. తాజాగా తిరుమల లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన మోహన్ బాబు ఈ విషయం తనకు ఎంతో బాధ కలిగించిందని, నకిలీ నెయ్యి వాడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మోహన్ బాబు చంద్రబాబును ప్రస్తావించారు. నా ఆత్మీయుడు, నా మిత్రుడు, నా స్నేహితుడు అంటూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆశీస్సులు చంద్రబాబు అందుకొని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఈ స్థాయిలో చంద్రబాబుపై ప్రశంసలు కురిపించడానికి మోహన్ బాబు ఎన్నిరకాల ప్రయోజనాలు ఆశిస్తున్నారో ఆయనకే తెలియాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+