ౠర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక ఇండియన్ యాక్టర్ ఆయనే.. ఎన్ని కోట్లంటే ?
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. 1978లో తన తొలి చిత్రం తిరనోట్టంతో సినీ రంగంలో అడుగుపెట్టిన ఆయన.. మంజిల్ విరింజా పుక్కల్ (1980) చిత్రంతో విజయవంతమైన హీరోగా గుర్తింపు పొందారు. నాటి నుంచి విభిన్న పాత్రలతో సహజ నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
కేవలం మలయాళంలోనే కాకుండా తమిళ, హిందీ, తెలుగు సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకుల్లో గుర్తింపు పొందారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా, గాయకుడిగా, థియేటర్ ఆర్టిస్ట్‌గా కూడా టాలెంట్ నిరూపించుకున్నారు. ఇప్పటికే జాతీయ ఉత్తమ నటుడిగా పలుమార్లు అవార్డు అందుకున్న ఆయనను.. భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ, 2019లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.

ఇక రీసెంట్ గానే ఆయన నటించిన ఎంపురాన్, తుడరమ్ చిత్రాలు రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. అంతకు ముందు తెలుగులో జనతా గ్యారేజ్ సినిమాలో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆయన మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న "కన్నప్ప" చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లోన విడుదల కాబోతున్న ఈ మూవీ.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఆయన భారతీయ నటుల్లో మరెవరూ సాధించని మరో ఘనతని సాధించారు. దీంతో మోహన్ లాల్ పేరు దేశవ్యాప్తంగా మరోసాటి హాట్ టాపిక్ గా మారింది.
ఇంతకీ మోహన్ లాల్ ఏం చేశారంటే..?
దుబాయ్ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది బుర్జ్ ఖలీఫా. ఈ భవనం 828 మీటర్ల ఎత్తు, 163 అంతస్తులతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడంగా పేరుగాంచింది. 2004లో నిర్మాణం ప్రారంభమై, 2010లో పూర్తైంది ఈ భవనం. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు దుబాయ్ సందర్శించిన ప్రతి ఒక్కరూ బుర్జ్ ఖలీఫాను చూడకుండా, ఫొటోలు, సెల్ఫీలు తీసుకోకుండా ఉండలేరు అనడంలో సందేహం అక్కర్లేదు. కాగా ఈ ఐకానిక్ భవనంలో కోటీశ్వరులు, సెలబ్రిటీలు ఫ్లాట్‌లు కొనుగోలు చేస్తున్నారు. ఆ జాబితాలో మోహన్ లాల్ కూడా చేరినట్టు తెలుస్తోంది.
బుర్జ్ ఖలీఫా లోని 29వ అంతస్తులో సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌ను మోహన్ లాల్ కొనుగోలు చేసినట్టు సమాచారం. అందుకోసం దాదాపు రూ.3.5 కోట్లు ఖర్చు చేసి.. ఈ ఫ్లాట్‌ను తన భార్య సుచిత్ర పేరిట రిజిస్టర్ చేయించారట. అంతేకాకుండా, దుబాయ్‌లోని మరో లగ్జరీ విల్లాలో 3 బీహెచ్‌కే ఫ్లాట్‌ను కూడా కొనుగోలు చేశారని సోషల్ మీడియా కోడై కూస్తుంది. దీంతో ౠర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొనుగోలు చేసిన ఏకైక భారతీయ నటుడిగా మోహన్ లాల్ రికార్డు సృష్టించారని ఆయన ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications