రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నుంచి రియల్ స్టోరీ.. మోహన్‌లాల్ నెక్ట్స్ మూవీ టైటిల్ ఫిక్స్!

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ అందింది. ఆయన కెరీర్లో 367వ చిత్రంగా తెరకెక్కుతున్న "ఎల్367" ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక టైటిల్, ఫస్ట్ లుక్‌ను శనివారం సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ సినిమాకు 'ఆపరేషన్ గంగా" అనే టైటిల్ ఖరారు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయాన ఉక్రెయిన్ దేశంలో చిక్కుకున్న వేలాది మంది భారతీయ విద్యార్థులు, పౌరులను సురక్షితంగా మాతృభూమికి తరలించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన చారిత్రాత్మక రెస్క్యూ మిషన్ ఆధారంగా ఈ కథను రూపొందిస్తున్నారు.

నాని 'పారడైజ్’కు మళ్లీ బ్రేక్? రిలీజ్ డేట్‌పై సస్పెన్స్!
నాని 'పారడైజ్’కు మళ్లీ బ్రేక్? రిలీజ్ డేట్‌పై సస్పెన్స్!

భారీ తారాగణం
'ఆపరేషన్ గంగా" సినిమా మోహన్‌లాల్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఉత్కంఠభరిత సర్వైవల్ థ్రిల్లర్ డ్రామా. ఈ సినిమాలో మోహన్‌లాల్‌తో పాటు బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, వర్ధమాన నటి భాగ్యశ్రీ బోర్సే, ప్రముఖ తమిళ నటుడు పార్థిబన్, ప్రఖ్యాత నటుడు ఆదిల్ హుస్సేన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను జార్జియాలోని సుందరమైన, కష్టతరమైన కొండ ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు.

Mohanlal L367 Titled Operation Ganga Epic Survival Thriller Based on Ukraine Rescue Mission

జాతీయ అవార్డు గ్రహీత దర్శకత్వం
సూపర్ హిట్ సినిమా 'మెప్పడియన్'తో జాతీయ అవార్డును గెలుచుకున్న దర్శకుడు విష్ణు మోహన్ ఈ ప్రతిష్టాత్మక సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళంలో ప్రసిద్ధి చెందిన 'శ్రీ గోకులం మూవీస్' బ్యానర్‌పై గోకులం గోపాలన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. బైజు గోపాలన్, వీసీ ప్రవీణ్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. భారతీయ పౌరుల సాహసాలు, యుద్ధ వాతావరణంలో వారు ఎదుర్కొన్న సవాళ్లను వెండితెరపై ఎంతో భావోద్వేగంగా ఆవిష్కరించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

పక్కా హిట్ సినిమా గురు..అదిరిపోయిన టీజర్
పక్కా హిట్ సినిమా గురు..అదిరిపోయిన టీజర్

టాప్ టెక్నీషియన్లతో అంతర్జాతీయ స్థాయి మేకింగ్
ఈ సినిమాను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు మేకర్స్ దిగ్గజ సాంకేతిక నిపుణులను రంగంలోకి దించారు. 'కిల్', 'ధురందర్' వంటి బాలీవుడ్ సినిమాలకు పనిచేసిన అంతర్జాయ యాక్షన్ డైరెక్టర్ సి యంగ్ ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ అందిస్తున్నారు. 'ధురందర్' ఫేమ్ శశ్వత్ సచ్‌దేవ్ సంగీతం సమకూరుస్తుండగా.. 'పుష్ప', 'పుష్ప 2' వంటి పాన్-ఇండియా సినిమాలకు అద్భుతమైన విజవల్స్ అందించిన మిరోస్లావ్ కుబా బ్రోజెక్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+