అల్లు అర్జున్‌తో నటిస్తే హీరోయిన్లంతా గోవిందా!
సినీ పరిశ్రమలో హీరోయిన్ల కెరీర్ తక్కువ కాలమే ఉంటుందని అందరూ అంటుంటారు. అయితే అది గతంలోని మాట. ప్రస్తుతం మాత్రం వారి కెరీర్ నిర్విరామంగా సంవత్సరాల తరబడి కొనసాగుతోంది. హీరోయిన్లంటే కేవలం 10 లేదంటే 20.. మహా అయితే 30 సినిమాలు చేస్తారు.. తర్వాత పరిశ్రమకు దూరమవుతారు అంటారు. కానీ ప్రస్తుతం ఉన్న హీరోయిన్లను పరిశీలిస్తే నయనతార, త్రిష, సమంత, అనుష్క లాంటి హీరోయిన్లంతా సంవత్సరాల తరబడి హీరోయిన్లుగా రాణిస్తున్నారు. అందుకు తగ్గ పారితోషికాన్ని కూడా వసూలు చేస్తుంటారు.
హీరోయిన్లకు అదృష్టం ముఖ్యం
హీరోయిన్లుగా సుదీర్ఘకాలం రాణించాలంటే అదృష్టం కూడా ఉండాలంటారు. కొందరు హీరోయిన్లు మాత్రం కేవలం నాలుగైదు సినిమాలకే పరిమితమవుతారు. అందులోను వారికి సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే తెలుగులో స్టార్ కథానాయకుడిగా కొనసాగుతున్న అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించారంటే త్వరలోనే వారంతా సినీ పరిశ్రమను వదిలి వెళ్లిపోతారంటూ వార్తలు వస్తుంటాయి. అందుకు తగ్గట్లుగానే కొందరు హీరోయిన్లు బన్నీ సరసన నటించి సినీ పరిశ్రమ నుంచి మూటా ముల్లె సర్దుకొని వెళ్లిపోయారు. వారెవరనేది పరిశీలిద్దాం.

భారీ పరాజయంపాలైన వరుడు
గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన వరుడు చిత్రంలో భానుశ్రీ మెహ్రా హీరోయిన్ గా నటించింది. హీరోయిన్ ఎంపికపై తీవ్రమైన విమర్శలు వచ్చిన ఈ చిత్రం విడుదలైన తర్వాత ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో ఎక్కడా కనపడలేదు. పరుగు చిత్రంలో హీరోయిన్ గా నటించారు షీలా కౌర్. ఆ సినిమా ఆడిన తర్వాత తారక్ పక్కన అదుర్స్ లో కూడా అవకాశం వచ్చింది. అయినా పరిశ్రమలో నిలదొక్కుకోలేకపోయింది.
ఎవరూ నిలదొక్కుకోలేకపోయారు
అల్లు అర్జున్ మరో చిత్రం బన్నీ. ఈ సినిమా హిట్ అయినప్పటికీ హీరోయిన్ గా నటించిన గౌరీ ముంజల్ మాత్రం నిలదొక్కుకోలేకపోయింది. టాలీవుడ్ కు దూరమైంది. అల్లు అర్జున్ తొలి చిత్రం గంగోత్రిలో అదితి అగర్వాల్ హీరోయిన్ గా నటించి విజయాన్ని అందుకున్నప్పటికీ నిలబడలేకపోయింది. ఆర్య సినిమాలో అనురాధ మెహతా నటించింది. సినిమా సూపర్ హిట్. యువతను బాగా ఆకట్టుకుంది. అయినా ఎక్కువ కాలం సినిమాల్లో నిలవలేదు. వేదం సినిమాలో దీక్షాసేథ్ నటించింది. ఆమెకూడా అంతే.. ఎక్కువ కాలం సినిమాల్లో నిలబడలేకపోయింది. ఇలా బన్నీ సరసన నటించి నిలదొక్కుకున్నవారు అతి తక్కువమంది అని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications