తల్లి, కొడుకులు కాస్తా భార్యాభర్తలయ్యారుగా.. ?
చిత్ర పరిశ్రమలో హీరోలు, హీరోయిన్ల మధ్య ప్రేమ చిగురించడం కొత్తేమీ కాదు. కలిసి పనిచేసే సందర్భంలో స్నేహం పెరగడం.. ఆ తర్వాత ప్రేమలో పడటం.. చివరకు అది పెళ్లి వరకు వెళ్లడం తరచూ జరిగే విషయం. బాలీవుడ్ నుంచీ టాలీవుడ్ వరకు ఎన్నో ప్రేమకథలు, ప్రేమవివాహాలు మనం చూసాం. ప్రముఖులు అయిన సైఫ్ అలీ ఖాన్ - కరీనా కపూర్, అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యా రాయ్, రణవీర్ సింగ్-దీపికా పదుకొణె, రణ్ బీర్ కపూర్ - అలియా భట్, విక్కీ కౌశల్ - కత్రీనా కైఫ్.. మహేష్ బాబు - నమ్రతా ఇలా ఎన్నో జంటలు ఉన్నాయి.
అంతే కాకుండా ప్రేమ పెళ్లిళ్లు ఈ మధ్య వరుసగా విడాకుల బాట పట్టడం కూడా చూస్తున్నాం. కానీ కొన్ని ప్రేమకథలు మాత్రం ఎంతో ఆశ్చర్యంగా ఉంటాయి. ఈ తరహా లవ్ స్టోరీ లలో ప్రముఖ నటి కిష్వర్ మర్చంట్ అలానే నటుడు సుయాష్ రాయ్‌లది. ఈ జంట ఓ టీవి సీరియల్‌లో తల్లి-కొడుకు పాత్రల్లో నటించగా.. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారి, చివరికి భార్యాభర్తలుగా మారారు.

కిష్వర్ - సుయాష్ లవ్ స్టోరీ...
2010లో ప్రారంభమైన 'ప్యార్ కీ యే ఒక కహానీ' అనే సీరియల్‌లో కిష్వర్ తల్లి పాత్రను పోషించగా.. సుయాష్ ఆమె కొడుకుగా నటించాడు. తెరపై తల్లి కొడుకులుగా కనిపించిన ఈ జంట నిజ జీవితంలో మాత్రం భార్య భర్తలు అయ్యారు. వీరిద్దరూ ప్రేమలో పడిన తర్వాత కిష్వర్ తనకంటే ఎనిమిదేళ్లు చిన్నవాడు కావడంతో.. మొదట సుయాష్ కుటుంబం ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. కాబోయే కోడలు పెద్దదని వ్యతిరేకత వ్యక్తం చేశారు. కానీ ప్రేమకు ఏది అడ్డు కాదని నిరూపిస్తూ తల్లిదండ్రులను ఒప్పించి.. 2016లో ఇద్దరూ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.
అయితే వారి పెళ్లి తర్వాత కూడా ఈ జంట ట్రోలింగ్ కి గురైంది. వారి మధ్య వయస్సును ఉద్దేశించి కొంతమంది సోషల్ మీడియాల్లో విమర్శలు చేశారు. కానీ ఆ కామెంట్స్ ని ఏ మాత్రం పట్టించుకోకుండా వారిద్దరూ అన్యోన్యంగా తమ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు. 2021లో వీరిద్దరికీ ఒక కుమారుడు జన్మించాడు.
మరోవైపు కిష్వర్ మర్చంట్ మాత్రం టీవీ రంగంలో తనదైన స్థానం సంపాదించుకుంది. ప్యార్ కీ యే ఒక కహానీ, ఏక్ హసీనా థీ, ఇత్నా కరో నా ముఝే ప్యార్ వంటి హిట్ సీరియల్స్‌తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా 'డియర్ ఇష్క్' అనే వెబ్ సిరీస్ లో ఆమె నటించిన మాయా కోస్టా పాత్రకు మంచి పేరు వచ్చింది. బిగ్ బాస్ హిందీ సీజన్ 9లోనూ ఆమె పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications