ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే సినిమాలు, సిరీస్‌లు ఇవే..!
మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ వారం కూడా పలు సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. గత వారం వచ్చిన సినిమాలు మంచి టాక్ ని సొంతం చేసుకోగా ఈ వీక్ లో వచ్చే చిత్రాలు ఎలా ఉంటాయో అని చర్చ జరుగుతోంది. తెలుగు సినిమా ఒకటే రిలీజ్ అవుతుండగా.. మరో రెండు డబ్బింగ్ సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అలానే ఓటీటీలో గతంలో మంచి ఆదరణ పొందిన సిరీస్ లకు సీక్వెల్స్ రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ వారం రిలీజ్ కి సిద్దమైన చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో మీకోసం ప్రత్యేకంగా...
థియేటర్‌లో రిలీజ్ అవుతున్న సినిమాలు..
మజాకా..
యంగ్ హీరో సందీప్‌కిషన్.. ధమాకా ఫేం దర్శకుడు త్రినాథరావు దర్శకత్వంలో చేస్తున్న సినిమా 'మజాకా'. రీతువర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ నటుడు రావు రమేష్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మన్మధుడు ఫేమ్ అన్షు అంబానీ ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్యమూవీస్ బ్యానర్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

శబ్ధం..
ఆది పినిశెట్టి హీరోగా రాబోతున్న సినిమా 'శబ్దం'. అరివళగన్ తెరకెక్కించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'వైశాలి' మూవీ మంచి హిట్ అందుకుంది. ఈ చిత్రంలో సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ ముఖ్య పాత్రలు పోషించారు. హర్రర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అగాథియా..
రంగం ఫేమ్ జీవా నటించిన లేటెస్ట్ మూవీ 'అగాథియా: ఏంజిల్స్ vs డెవిల్'. రాశీఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర పోషించారు. పా.విజయ్ దరకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళం, తెలుగుతో పాటు పాన్ ఇండియా తీలిజ్ కి మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది.
తకిట తదిమి తందనా..
నూతన నటీనటులు ఆదిత్య, ప్రియ జంటగా రాజ్ లోహిత్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'తకిట తదిమి తందాన'. కొప్పుల చందన్ కుమార్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను అలరించేలా కథ, కథనాలను తీర్చిదిద్దినట్లు మూవీ యూనిట్ వెల్లడించింది. మూవీ ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు, సిరీస్‌లు..
నెట్‌ఫ్లిక్స్..
డబ్బా కార్టెల్ - వెబ్ సిరీస్ - ఫిబ్రవరి 28
అమెజాన్ ప్రైమ్..
సుడల్2 - వెబ్ సిరీస్ - ఫిబ్రవరి 28
జిద్దీ గర్ల్స్ - వెబ్ సిరీస్ - ఫిబ్రవరి 27
హౌస్ ఆఫ్ డేవిడ్ - వెబ్ సిరీస్ - ఫిబ్రవరి 27
సూపర్ బాయ్స్ ఆప్ మాలేగావ్ - సినిమా - ఫిబ్రవరి 28
జియో హాట్‌స్టార్..
లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ - మలయాళం - సినిమా - ఫిబ్రవరి 28
బీటిల్ జ్యూస్ - సినిమా - ఇంగ్లీష్ - ఫిబ్రవరి 28
ది వాస్ప్ - సినిమా - ఇంగ్లీష్ - ఫిబ్రవరి 28
సూట్స్ - వెబ్ సిరీస్- ఫిబ్రవరి 24
ఎంఎక్స్ ప్లేయర్..
ఆశ్రమ్ 3 - హిందీ - వెబ్ సిరీస్ - ఫిబ్రవరి 27












Click it and Unblock the Notifications