స్టార్ హీరోతో డేటింగ్ రూమర్స్.. స్పందించిన మృణాల్!

Mrunal Thakur: ఇటీవల కాలంలో నటి మృణాల్ ఠాకూర్ పేరు.. ప్రముఖ నటుడు ధనుష్‌తో జతచేరి వినిపిస్తోంది. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో మృణాల్ ఠాకూర్ తన వ్యక్తిగత జీవితాన్ని ఎందుకు రహస్యంగా ఉంచడానికి ఇష్టపడుతుందో ఇటీవల ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ విషయంపై ఆమెకు ఉన్న నమ్మకాలు, ఆలోచనలను మృణాల్ పంచుకుంది.

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన తాజా చిత్రం 'సన్ ఆఫ్ సర్దార్ 2' విడుదల తర్వాత, ధనుష్‌తో డేటింగ్ వార్తలతో వార్తల్లో నిలిచారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన జీవితానికి సంబంధించి విషయాలను బయట పెట్టడానికి ఇష్టపడనని చెప్పారు. వాటి గురించి మాట్లాడి తనపై 'నజర్' పడేలా చేయాలా చేయాలనుకోవడం లేదని పేర్కొన్నారు. కెరీర్‌లో సాధించాల్సినవి ఇంకా చాలా ఉన్నాయని.. సాధించనివి చేయాల్సినవి చాలా ఉన్నాయన్నారు. ఆ విషయాల గురించి మాట్లాడాలంటే.. అవి నిజంగా జరిగిన తర్వేతా మాట్లాడతానన్నారు.

Mrunal Thakur Reacts to Dating Rumors with Dhanush Here s What She Said

వ్యక్తిగత జీవితానికి సరిహద్దులు గీసుకోవడం ముఖ్యం
ఈ గ్లామర్ ప్రపంచంలో వ్యక్తిగత జీవితానికి సరిహద్దులు గీసుకోవడం చాలా ముఖ్యమని మృణాల్ ఠాకూర్ పేర్కొన్నారు. "ఎవరైనా తమ గురించి మాట్లాడే ముందు ఆలోచించాలి. ప్రపంచానికి ఎంత చెప్పాలి అనే దానిపై మనకు ఒక నియంత్రణ ఉండాలి. కొన్నిసార్లు మనం చేయాలనుకున్న లేదా ప్రస్తుతం చేస్తున్న పనుల గురించి మాట్లాడి, వాటిని మనమే చెడగొట్టుకుంటాం" అని ఆమె అన్నారు. ఈ విషయంలో తన వ్యక్తిత్వం చాలా భిన్నమని మృణాల్ వెల్లడించారు. చాలా మంది తమ రాబోయే సినిమాల గురించి మాట్లాడుతారు కానీ తాను అలా చేయనన్నారు. "నేను వాటి గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు; ఏం వస్తుందో, ఏం రాదో అందరికీ తెలుసు. నా జీవితంలో ఏం జరుగుతుందో నిరంతరం ఆలోచిస్తూ, వాటి గురించి మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు" అని మృణాల్ స్పష్టం చేశారు.

ధనుష్, మృణాల్ డేటింగ్ వార్తలు
మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు వేడుకల్లో ధనుష్, మృణాల్ కలిసి కనిపించిన తర్వాతే వీరిద్దరి మధ్య ప్రేమాయణం మొదలైందనే వార్తలు ఊపందుకున్నాయి. ఆగస్ట్ 1న జరిగిన మృణాల్ పుట్టినరోజు పార్టీలో ఈ జంట కలిసి కనిపించడంతో సామాజిక మాధ్యమాలలో వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై చర్చ మొదలైంది. ఈ సంఘటన తర్వాతే మృణాల్ వ్యక్తిగత జీవితంపై ఇలా స్పందించడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+