దానికి 'నో' చెప్పడంవల్లే ఆఫర్లు తగ్గాయి.. మృణాల్ ఠాకూర్ సంచలనం

యంగ్ బ్యూటీఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది. తెలుగు పరిశ్రమలోకి సీతారామం సినిమాతో అడుగు పెట్టింది. తన అందం, నటనతో అందరినీ కట్టిపడేసింది. తర్వాత వచ్చిన హాయ్ నాన్న, ఫ్యామిలీస్టార్ సినిమాలతో తెలుగింటి అమ్మాయిలా మారిపోయింది. అభిమానుల మనసును దోచుకుంటోంది. క్లాసికల్ మూవీస్ చేస్తున్న మృణాల్ కు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం ఉంది. వరుసగా ఆఫర్లు అందుకుంటున్న ఈ అమ్మడుకు తల్లిదండ్రుల వల్లే అవకాశాలు తగ్గాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ దీనికి సంబంధించిన విషయాలను ప్రేక్షకులతో షేర్ చేసుకుంది.

తన తల్లిదండ్రులకు సినిమాల్లో ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సన్నివేశాలు ఉంటే నచ్చవని, ఈ కారణంవల్లే తాను అలాంటి సన్నివేశాలున్న సినిమాలను తిరస్కరిస్తూ వస్తున్నట్లు చెప్పారు. అటువంటి సన్నివేశాల్లో తనను చూస్తే వాళ్ల భావాలు ఎలా ఉంటాయి? ఎలా స్వీకరిస్తారు? అనే విషయంలో భయం వేసిందని చెప్పింది. దీనిమీద ఎంతకాలమని మథనపడాలి.. అని ఆలోచిస్తుండగా తల్లిదండ్రులతో మాట్లాడే సమయం వచ్చింది. ముద్దు సన్నివేశాలు కూడా వృత్తిలో ఓ భాగమేనని, మీకు అసౌకర్యంగా ఉందనే కారణంతో చాలా ఆఫర్లు వదులుకున్నానని చెప్పింది. అది తన ఎంపిక కాదని, పాత్రలో ప్రాధాన్యం ఉన్నప్పుడే చేయాలని, అందుకు మీరు అంగీకరించాలని తల్లిదండ్రులను కోరినట్లు మృణాల్ వెల్లడించింది.

mrunal thakur sensational comments on movie offers

మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. హాయ్ నాన్నలో కనిపించింది. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాబోతున్న చిత్రంలో కూడా మృణాల్ హీరోయిన్ గా ఎంపికైందని వార్తలు వస్తున్నాయి. వీటిని చిత్రయూనిట్ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఫ్యామిలీస్టార్ సినిమా ఫ్లాపవడం అమ్మడును కాస్త నిరాశపరిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+