తనకంటే పదేళ్లు చిన్నవాడైన క్రికెటర్ తో డేటింగ్.. అడ్డంగా దొరికిపోయిన స్టార్ హీరోయిన్..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వరుస హిట్స్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. జెర్సీ, సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టారు. ఇటీవల అడవిశేష్ తో కలిసి డెకాయిట్ మూవీలో నటించి మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం హిందీలో హై జవానీ తో ఇష్క్ హోనా హై, పూజా మేరీ జాన్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో వస్తున్న రాకా చిత్రంలోనూ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇక ఇటీవలి కాలంలో డేటింగ్ రూమర్స్ తో వరుసగా మృణాల్ ఠాకూర్ వార్తల్లో నిలుస్తున్నారు. సెలబ్రిటీ హీరోలు, క్రికెటర్లతో ఆమె డేటింగ్ చేసినట్లు రోజుకో వార్త పుట్టుకొస్తుంది. ఈ రూమర్స్ మొదటగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నుంచి స్టార్ట్ అయ్యాయి. ధనుష్- మృణాల్ ఠాకూర్ డేటింగ్ లో ఉన్నారని.. ఏకంగా పెళ్లి కూడా చేసుకోబోతున్నారని టాక్ వచ్చింది. అయితే ఈ వార్తల్ని అప్పట్లో మృణాల్ ఠాకూర్ తీవ్రంగా ఖండించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని మృణాల్ పలు సందర్భాల్లో వ్యక్తం చేస్తూ వచ్చారు.
ఆ తర్వాత మృణాల్ కు సంబంధించి మరో క్రేజీ వార్త నెట్టింట హల్ చల్ చేసింది. మృణాల్ ఠాకూర్.. ధనుష్ తో బ్రేకప్ చేసుకుందని ఇప్పుడు ప్రముఖ స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ తో డేటింగ్ చేస్తుందని వార్తలు వచ్చాయి. వీళ్లిద్దరు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఒకరిని ఒకరు ఫాలో అవ్వడమే కారణం అని పలు కథనాలు పుట్టుకొచ్చాయి. పంత్ కేవలం ఇద్దరు మహిళలను మాత్రమే ఫాలో అవుతున్నారని.. ఒకరు అతని సోదరి కాగా మరొకరు మృణాల్ ఠాకూర్ అని తేలడంతో ఈ రూమర్స్ గుప్పుమన్నాయి. అయితే ఈ అంశంపై అటు మృణాల్.. ఇటు పంత్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

ఈ లోపు మృణాల్ ఠాకూర్ కు సంబంధించిన మరో రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీమ్ ఇండియా ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ తో మృణాల్ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవల వీరిద్దరూ ముంబైలోని ఓ కేఫ్ లో కలిసి కనిపించడం వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. దీనిపై మృణాల్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications