స్టార్ హీరోతో ఫోటో షేర్ చేసిన స్టార్ క్రికెటర్ భార్య.. ఎవరో గుర్తుపట్టారా ??
బాలీవుడ్ స్టార్ హీరో, గ్రీక్ గాడ్.. హృతిక్ రోషన్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఆకట్టుకునే నటన, అదరగొట్టే డ్యాన్స్ లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. 1980లో విడుదలైన 'ఆశా' చిత్రంలో బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2000లో వచ్చిన 'కహో నా... ప్యార్ హై' సినిమాతో హీరోగా అరంగేట్రం చేసి సంచలన విజయం సాధించడంతో ఓవర్ నైట్ లోనే స్టార్‌గా మారిపోయారు. తొలి సినిమాకే రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకుని బాలీవుడ్ చరిత్రలో అరుదైన ఘనత సాధించారు.
'కోయి మిల్ గయా', 'కృష్ణ' సిరీస్, 'ధూమ్ 2', 'జోధా అక్బర్', 'జిందగీ నా మిలేగీ దొబారా', 'అగ్నిపథ్', 'వార్' వంటి విభిన్న చిత్రాలతో నటుడిగా తన పరిధిని నిరూపించారు. ముఖ్యంగా ఛాలెంజింగ్ పాత్రలను ఎంచుకుంటూ.. కెరీర్ కొనసాగిస్తున్నారు. అలానే వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, వాటిని ధైర్యంగా జయించి ముందుకు సాగిన వ్యక్తిగా హృతిక్ నిలిచారు. రీసెంట్ గానే టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ తో కలిసి "వార్ 2" చిత్రంలో నటించారు. అయితే ఆ మూవీ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

కాగా సోషల్ మీడియాలో సినీతారల పర్సనల్ విషయాలు తెగ వైరలవుతుంటాయి. అలాగే త్రోబ్యాక్ ఫోటోస్ కూడా చక్కర్లు కొడుతుంటాయి. ఇప్పుడు లేటస్ట్ గా హృతిక్ రోషన్ పాత ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. అందులో హృతిక్ పక్కన ఉన్న అమ్మాయి ఇప్పుడు టీమిండియా స్టార్ క్రికెటర్ భార్య కావడం మరింత హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఈ ఫోటో ఫుల్ వైరల్ అవుతుండగా.. మొదట ఎవరో గుర్తుపట్టకపోయినా.. కొద్దిసేపటికి మాత్రం క్లారిటీ వచ్చేస్తుంది.
కాగా ఆ ఫోటోలో ఉన్నది ఎంఎస్ ధోనీ భార్య సాక్షి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే ఆమె.. 2000 నుండి 2006 ఫోటోలు అంటూ పలు పిక్స్ షేర్ చేసింది. అందులో స్నేహితులతో కలిసి ఉన్న పాత రోజులను గుర్తుచేసుకుంది. కానీ ముఖ్యంగా ఒక ఫోటోలో హృతిక్ రోషన్‌తో ఉండడం అందరినీ ఆకర్షిస్తోంది. హృతిక్ లుక్ 2006లో విడుదలైన క్రిష్ సినిమాలోనిది అని తెలుస్తోంది. రాకేష్ రోషన్ దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించి మెప్పించింది. త్వరలోనే క్రిష్ 4 ప్రేక్షకుల ముందుకు రానుంది.












Click it and Unblock the Notifications