నలుగురితో డేటింగ్ చేశా.. బిగ్ బాస్ బ్యూటీ హాట్ కామెంట్స్ ..
ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే.. అంటూ టాలీవుడ్ ను ఊపుఊపిన నటి ముమైత్ ఖాన్. ఈపాట ఇప్పటికీ సంచలనమే. ఈ పాటలో ముమైత్ ఖాన్ తన అందాలతో కుర్రకారు మతిపోగొట్టింది. అయితే చాలామంది అమ్మాయిలు హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకు వస్తారు. కానీ ముమైత్ ఖాన్ మాత్రం ఫస్ట్ మూవీ నుంచే ఐటెమ్ సాంగ్స్ తో ఇరగదీసింది.దాదాపు అందరు పెద్ద హీరోలతో ముమైత్ ఖాన్ ఆడిపాడింది. తెలుగులో మాత్రమే కాదు.. తమిళం, కన్నడ భాషల్లోనూ ఐటం సాంగ్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చి, అక్కడ కూడా ఫేమస్ అయింది. ఆ తర్వాత ఒడియా, బెంగాలీ భాషల్లో సైతం డ్యాన్సులు చేసి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది ముమైత్ ఖాన్. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ముమైత్ ఇంట్రస్టింగ్ విషయాలు పంచుకుంది.

తనకు మోజర్ యాక్సిడెంట్ కావడంతో పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యిందట ముమైత్. ప్రజెంట్ ఇప్పుడు కోలుకుంది. అవకాశాలు వస్తున్నప్పటికి తను మాత్రం బిజినెస్ ప్లాన్ లో ఉందట. 'రిసెంట్‌గా ఎంతో దైర్యం చేసి ఈ బిజినేస్ స్టార్ట్ చేశాను. దేవుడి మీద భారం వేశా. నాకు కొంత మంది సపోర్ట్ కూడా ఉంది అందుకే ముందడుగు వేశాను' అని చెప్పుకొచ్చింది.
ఆ నలుగురు..
'నేను నలుగురితో డేటింగ్ చేశాను. ఎవరితో వర్కౌంట్ అవ్వలేదు. కానీ నేను ఈ నలుగురిని జెన్యూన్ గానే ఇష్టపడ్డాను టైంపాస్ మాత్రం చేయలేదు. అయిన కూడా సెట్ అవ్వలే. చాలా మంది బ్రేక్ అప్ అవ్వగానే. రిలేషన్ షిప్స్ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. నేను అలా కాదు పెళ్ళి చేసుకోకూడదు.. రిలేషన్ షిప్స్ వద్దు అని అనుకోను. రాసి ఉంటే ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది.. కిస్మత్ ని నమ్ముకుంటున్న' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ముమైత్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications