కొత్త వ్యాపారం మొదలెట్టిన ముమైత్ ఖాన్..ఇక వారికి పండుగే
ఐటం సాంగ్ అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది జయలలిత, జయమాలిని, ఆ తర్వాత తరం వారికి సిల్క్ స్మిత అనే చెప్పాలి. అయితే చాలాకాలం పాటు ఐటం సాంగ్స్‌కు సరైన హీరోయిన్లు లేక అభిమానులు అల్లాడిపోయారు.వారందరి కోరిక తీర్చిన ఏకైక భామ ముమైత్ ఖాన్. ముమైత్ ఖాన్ పేరు చెప్పగానే మొదటగా గుర్తుకు వచ్చేది ఆమె నటించిన ఐటం సాంగ్సే. ఆమె 2004లో "ఫూల్" అనే సినిమాతో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ సరైన గుర్తింపు దక్కలేదు.
కానీ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాతో ముమైత్ ఖాన్‌తో సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రభాస్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో ముమైత్ ఖాన్ నటించారు.మైసమ్మ IPS అనే సినిమాలో ముమైత్ ఖాన్ మెయిన్ రోల్‌లో నటించారు. ఆ తర్వాత కొత్తతరం హీరోయిన్స్ ఎంట్రీతో ముమైత్ ఖాన్ హవా దక్కింది. తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌లో కూడా ముమైత్ ఖాన్ సందడి చేశారు. తాజాగా ముమైత్ ఖాన్ కొత్త బిజినెస్ ప్రారంభించారు.బ్యూటీ రంగంలోకి ముమైత్ ఖాన్ ఎంట్రీ ఇచ్చింది.

ముమైత్ ఖాన్ మాట్లాడుతూ... ''ఇప్పుడు ప్రతి ఒక్కరిలో అందం మీద శ్రద్ధ పెరిగింది. సాధారణ మహిళలు ఆఫీసులకు వెళ్లేవారు సైతం మేకప్ వేసుకుంటున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ వంటివి అయితే చాలామంది తప్పనిసరిగా మేకప్ కోసం పార్లర్లకు వెళుతున్నారు. ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్టులను తయారు చేయడం కోసం నేను ఈ 'వీ లైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమీ' ప్రారంభించానని చెప్పుకొచ్చారు.ఈ కార్యక్రమంలో ఆర్టిస్టులు జ్యోతి, సింగర్ రోల్ రైడా, అక్సా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications