పెళ్లి, పిల్లల తర్వాత హీరోయిన్‌గా.. క్రికెటర్‌తో ఎఫైర్.. బోల్డ్ లేడీ సంచలనం!
సినీ పరిశ్రమలో ఒక సాధారణ నమ్మకం ఉంది. తల్లి అయిన తర్వాత హీరోయిన్ల కెరీర్ ముగుస్తుందని.. కానీ ఈ అపోహను బ్రేక్ చేసి, పెళ్లైన తర్వాత, ఇద్దరు పిల్లల తల్లిగా సినీరంగంలోకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేసిన ఒక హీరోయిన్ ఉన్నారు. ఆమె నటన, అందం, ధైర్యమైన పాత్రల ఎంపికతో 80వ దశకంలో సంచలనం సృష్టించి, నేటికీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఆమె మరెవరో కాదు.. మున్మున్ సేన్. ఆమె వృత్తిపరమైన విజయాలతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ కొన్ని వివాదాలను ఎదుర్కొని నిత్యం చర్చల్లో నిలిచింది.
రాజకుటుంబ నేపథ్యం.. వైవిధ్యభరిత కెరీర్
మున్మున్ సేన్ కేవలం ఒక నటిగానే కాకుండా.. రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుని విజయం సాధించిన ఒక ప్రత్యేక వ్యక్తి. ఆమె సంపన్న కుటుంబానికి చెందినది. ఆమె తాత ఆదినాథ్ సేన్ కోల్‌కతా నగరంలోని ప్రసిద్ధ, ధనవంతులైన వ్యాపారవేత్త కాగా.. ఆమె తల్లి ప్రఖ్యాత బెంగాలీ నటి సుచిత్రా సేన్. ఈ కళాత్మక, సంపన్న నేపథ్యం ఆమె వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదపడింది. మున్మున్ సేనే 1978లో రాజకుటుంబానికి చెందిన వ్యాపారవేత్త భారత్ దేవ్ వర్మను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు రియా సేన్, రైమా సేన్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే వీరిద్దరూ బాలీవుడ్ లో తమ తల్లిలాగా చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించలేకపోయారు.

30 ఏళ్ల వయసులో సినీరంగ ప్రవేశం.. బోల్డ్ ఛాయిస్‌లతో సంచలనం
మున్మున్ సేన్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది సాధారణ హీరోయిన్ల వయసులో కాదు. ఆమె వివాహం, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత 30 ఏళ్ల వయసులో సినిమాల్లోకి ప్రవేశించింది. ఇది అప్పట్లో ఒక విప్లవాత్మక నిర్ణయం. ఆమె తన బోల్డ్ ఛాయిస్‌లతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె తన మొదటి చిత్రం 'అందర్ బాహర్' (1984) తోనే తన ఉనికిని చాటుకుంది. ఆ తర్వాత ఆమె మాధురి దీక్షిత్‌తో కలిసి '100 డేస్' వంటి బ్లాక్‌బస్టర్‌లలో కనిపించింది. 'జఖ్మీ దిల్', 'కుచ్ తో హై', 'సిరివెన్నెల' వంటి చిత్రాలలో నటించి తన నటనకు ప్రశంసలు అందుకుంది. వీటితో పాటు 'మొహబ్బత్ కి కసమ్', 'ముసాఫిర్', 'షీషా' (మిథున్ చక్రవర్తితో) వంటి చిత్రాలలో కూడా నటించి, తన విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మున్మున్ సేన్ తన కెరీర్ మొత్తం 60 సినిమాలు, 40కి పైగా టీవీ షోలలో నటించింది. ఆమె కేవలం బెంగాలీ, హిందీ చిత్రాలకే పరిమితం కాకుండా మలయాళం, కన్నడ, తెలుగు(సిరివెన్నెల), తమిళం, మరాఠీ వంటి వివిధ భాషా చిత్రాలలోనూ నటించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిరూపించుకుంది. 1987లో 'సిరివెన్నెల' చిత్రంలో తన అద్భుత నటనకు గాను ఆమె అనేక అవార్డులు అందుకుంది.
టీచర్ నుండి టాప్ నటిగా.. తర్వాత రాజకీయాల్లోకి...
మున్మున్ సేన్ సినిమాల్లోకి రాకముందు ఆమె జీవితం మరో ఆసక్తికరమైన మలుపు తిరిగింది. ఆమె ఇంగ్లీష్ లిటరేచర్ టీచర్‌గా కోల్‌కతాలోని ఒక పాఠశాలలో బోధించేది. ఆమె ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యను అభ్యసించింది. విద్యా రంగం నుంచి సినీ రంగంలోకి, ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించడం ఆమెలోని అన్వేషణాత్మక, సాహసోపేత వ్యక్తిత్వానికి నిదర్శనం. ఆమె మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి, రాజకీయాల్లోనూ తన ముద్ర వేసింది.
వ్యక్తిగత జీవితంలో వివాదాలు.. ఇమ్రాన్ ఖాన్‌తో ఎఫైర్!
మున్మున్ సేన్ వృత్తిపరమైన విజయాలతో పాటు ఆమె వ్యక్తిగత జీవితం కూడా ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉండేది. ఆమె తన కెరీర్ సమయంలో సైఫ్ అలీ ఖాన్, నిర్మాత రోమూ సిప్పి, విక్టర్ బెనర్జీలతో ఆమె పేరును ముడిపెట్టారుయ అయితే అన్నింటి కంటే ఎక్కువ చర్చకు దారితీసిన విషయం మాజీ క్రికెటర్, పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌తో ఆమెకు ఎఫైర్ ఉందన్న వార్తలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి. అనేక మీడియా నివేదికలు వారిద్దరూ డేటింగ్ చేశారని పేర్కొన్నాయి. ఆ సమయంలో మున్మున్ వివాహిత కావడంతో ఈ వార్తలు మరింత సంచలనం సృష్టించాయి. ఒక మ్యాగజైన్ కోసం వారిద్దరూ కలిసి ఫోటోషూట్ కూడా చేశారని చెబుతారు.
ఈ వార్తలపై మున్మన్ సేన్ స్వయంగా స్పందించారు. 2019లో పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. "ఇమ్రాన్ ఖాన్ తో సమయం గడపడం నాకు చాలా ఇష్టం. నా భర్తకు(భారత్ దేవ్ వర్మ) ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు ప్రజలకు ఇందులో ఎందుకు ఆసక్తి!" అని ఘాటుగా ప్రశ్నించింది. అప్పుడు ఆమె ఇమ్రాన్ తో తనది కేవలం స్నేహం మాత్రమేనని, ఎఫైర్ కాదని కూడా స్పష్టం చేసింది. తన వ్యక్తిగత జీవితంపై బహిరంగంగా మాట్లాడే ధైర్యం, ఆమెలోని బోల్డ్‌నెస్‌కు నిదర్శనం.
-
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
హిందీ స్టార్ హీరోల వేధింపుల వల్లే డైరెక్టర్లకు కష్టాలు.. -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
‘ధురంధర్2’ చూశారా? ప్రేక్షకుల్లో సృష్టించిన విద్వేషపూరిత చీలిక అర్థమైందా? -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే! -
సొంత సినిమాను వదిలేసి పరాయి సినిమాకు భజనా? -
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
సొంత భర్త సినిమాకు దీపిక ఆబ్సెంట్.. ఏం జరుగుతోంది..? -
"ధురంధర్ 2 సినిమాను బ్యాన్ చేయాలి" -
రణవీర్ సింగ్‌ను చెంపదెబ్బ కొట్టిన ప్రముఖ నటి! వీడియో -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ












Click it and Unblock the Notifications