ఒకే సినిమాకు ఏపీ, తెలంగాణలో అవార్డులు వద్దు - మురళీ మోహన్

తెలంగాణ ప్రభుత్వం దాదాపు పదకొండేళ్ల తర్వాత నంది అవార్డులను ప్రకటించింది. ఈసారి "గద్దర్ అవార్డులు" పేరుతో అవార్డులను ప్రదానం చేయనున్నారు. రీసెంట్ గానే 2024 కు సంబంధించి అవార్డులను అనౌన్స్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా 2014 నుంచి 2023 మధ్య వచ్చిన సినిమాలకు ఉత్తమ చిత్రం విభాగంలో అవార్డులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ డీసీ చైర్మన్ దిల్ రాజు, జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంలో మురళీ మోహన్ మాట్లాడుతూ.. ఒకే సినిమాకు ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు అవార్డులు ఇవ్వడం మంచిది కాదు అన్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అవార్డులు ప్రకటించే విషయంలో ఒకే నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒకే సినిమాకు రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వేర్వేరు కేటగిరీల్లో అవార్డులు ప్రకటిస్తే అనవసరమైన చర్చలకు, వివాదాలకు దారితీసే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

murali-mohan-shocking-comments-awards-by-ap-and-telangana

ఒక సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటిస్తే.. తదుపరి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించాలి. ఇలా సమన్వయంతో ముందుకు వెళితే వివాదాలకు తావుండదని సూచించారు. తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోందని.. తెలుగు ప్రేక్షకులంతా ఒక్కటే అని అన్నారు. ఒక రాష్ట్రం ఎక్కువ, మరో రాష్ట్రం తక్కువ అన్న భావన అవసరం లేదన్నారు మురళీమోహన్.

అలానే తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించడం హర్షణీయమని అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తనవంతు బాధ్యతగా సినీ అవార్డులను పునరుద్ధరించాలని సూచించారు. సినీ పరిశ్రమ, ప్రేక్షకుల ఐక్యతను దృష్టిలో ఉంచుకుని, రెండు రాష్ట్రాలు కలిసి చర్చించుకొని స్పష్టమైన విధానాన్ని అవలంబించాలని పిలుపునిచ్చారు. తెలుగు సినిమా పరిశ్రమ, ప్రేక్షకుల ఐక్యతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. మురళీమోహన్ సూచనపై ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో అని సర్వత్రా చర్చ నడుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+