'లెనిన్' సినిమాలో రష్మికతో ఐటెం సాంగ్: తమన్ క్లారిటీ!

మూడేళ్ల విరామం తర్వాత అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన సినిమా 'లెనిన్' థియేటర్లలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో సంగీత దర్శకుడు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , పాటలకు మంచి క్రేజ్ లభించింది. అయితే ఈ చిత్రానికి సంబంధించి తెరవెనుక జరిగిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ ఇటీవల పంచుకున్నారు. 'లెనిన్' సినిమాలో ఓ ఐటెం సాంగ్ ప్లాన్ చేసినట్లు.. చివరి నిమిషంలో దాన్ని తీసేయాల్సి వచ్చిందని తమన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

'ది ప్యారడైజ్’: ఐటమ్ సాంగ్‌లో క్రేజీ బ్యూటీ?
'ది ప్యారడైజ్’: ఐటమ్ సాంగ్‌లో క్రేజీ బ్యూటీ?

లెనిన్ సినిమాలో ఓ ఐటెం సాంగ్ పెట్టాలని అనుకున్నామని.. కంపోజ్ కూడా చేశామని.. కానీ పాట షూటింగ్ ప్రారంభించాలనుకునే సమయానికి.. స్టోరీకి ఐటెం సాంగ్ సెట్ కాదని భావించారని తమన్ చెప్పుకొచ్చారు. ఈ ఐటెం సాంగ్ ను బలవంతంగా సినిమాలో పెట్టడం వల్ల స్టోరీ వేగానికి అంతరాయం కలుగుతుందని.. ప్రేక్షకులు దానిని ఒక "స్పీడ్ బ్రేకర్"గా భావించే ప్రమాదం ఉందని నిర్మాతలు గ్రహించారని తమన్ తెలిపారు.. అందుకే సినిమా రన్‌టైమ్‌, కథలోని వేగాన్ని కాపాడటం కోసం ఆ పాటను తొలగించడమే మంచిదని నిర్ణయించుకున్నారు. కానీ ఆ సమయంలో తనకు కోపం వచ్చిందని.. బాధలో సినిమాకు సంబంధించిన నాలుగైదు వాట్సాప్ గ్రూపుల నుంచి వైదొలిగినట్లు తమన్ చెప్పుకొచ్చారు. ఈ ఐటెం సాంగ్ కోసం రష్మిక, పూజా హెగ్డే పేర్లను చిత్ర బృందం పరిశీలించినట్లు పేర్కొన్నారు. కానీ ఆ ఐటెం సాంగ్ పెడితే సినిమా కథ మారిపోతుందని.. నెగెటివ్ రివ్యూలు రాస్తారని.. చివరి నిమిషంలో తీసేశారని సంగీత దర్శకుడు తమన్ వెల్లడించారు.

Music composer Thaman Spills On Scrapped Item Song In Akhil Akkineni Lenin Featuring Rashmika
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: రొటీన్ ఫార్ములాను పక్కన పెట్టి బిగ్ రిస్క్?
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: రొటీన్ ఫార్ములాను పక్కన పెట్టి బిగ్ రిస్క్?

తమన్ అసంతృప్తి
చార్ట్‌బస్టర్ అయ్యేంత సత్తా ఉన్న పాటను తొలగించడంతో తాను కొంత నిరాశకు గురయ్యానని తమన్ అంగీకరించారు. ఒకవేళ ఆ పాట సినిమాలో ఉండి ఉంటే, 'లెనిన్' ఆల్బమ్ ఆకర్షణ మరొక స్థాయిలో ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ సినిమాలో ఆ స్పెషల్ సాంగ్ లేకపోయినా, తమన్ అందించిన ఉత్సాహభరితమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా విజయంలో, ప్రేక్షకులను థియేటర్లలో కట్టిపడేయడంలో ప్రధాన పాత్ర పోషించిందని ప్రశంసలు లభించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+