"బాలయ్యని చూస్తే కొట్టాలనిపిస్తుంది".. షాకింగ్ కామెంట్స్‌తో రచ్చ !

టాలీవుడ్ స్టార్ హీరో, నందమూరి నటసింహం బాలకృష్ణకి సపరేట్ కి దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. తెరపై ఆయన మాస్ డైలాగ్స్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి భారీ ఫాలోయింగ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో సైతం అభిమానులు ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి 'డాకు మహరాజ్'తో హిట్ అందుకున్న ఆయన.. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 చిత్రంలో నటిస్తున్నారు. 'అఖండ' మూవీకి సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతుంది.

ఈ మూవీలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు భారీ హిట్స్ అందుకోగా.. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

music-director-thaman-shocking-comments-on-balakrishna-goes-viral

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ లో అంచనాలను భారీగా పెంచేసింది. దసరా కానుకగా సెప్టెంబర్ 25 న ఈ చిత్రం రిలీజ్ చేస్తామని ప్రకటించినా.. అనూహ్యంగా వాయిదా వేస్తున్నట్లు అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు నిర్మాతలు. అయితే కొత్త రిలీజ్ డేట్ త్వరలోనే వెల్లడించనున్నట్టు సమాచారం.

కాగా ఈ ఏడాదితో బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆయన్ని ఘనంగా సత్కరించింది. ఈమేరకు హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు హాజరైన ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

బాలయ్యని చూస్తే కొట్టాలనిపిస్తుంది..

తమన్ మాట్లాడుతూ.. బాలకృష్ణని చూస్తే నాకు మాటలు రావు. ఆయన్ని ఏదైనా తీసుకుని కొట్టాలనిపిస్తుంది. ఆయన సినిమాలంటే మీకు అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందని చాలామంది నన్ను అడుగుతుంటారు. ఆ విషయం నాక్కూడా తెలియదు అన్నారు. బాలయ్య సినిమాలకి మ్యూజిక్ చేస్తున్నప్పుడు నా చేతుల్లో కొత్తగా కత్తులు, కర్రలు వచ్చేస్తాయని సరదాగా వ్యాఖ్యానించారు. అలా ఎందుకు జరుగుతుందో డాక్టర్స్ నా డీఎన్ఏని టెస్ట్ చేయాలి' చెప్పుకొచ్చారు.

'అఖండ 2'తో బాలయ్య బాబు అన్ని రికార్డులు తిరగరాస్తారని తమన్ ఆశాభావం వ్యక్తం చేశారు. తన కెరీర్‌ని 'అఖండ' బిఫోర్, ఆఫ్టర్ అని అంటున్నారని, తనకి ఇంత పేరు రావడానికి బాలయ్యే కారణమని తెలిపారు. ఇప్పుడు బుక్ రికార్డులు చూస్తున్నారని.. త్వరలో అఖండ 2తో ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు చూస్తారని కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తమన్ చేసిన వ్యాఖ్యలు ఫుల్ వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+