ఆ హీరో వల్ల నా కెరీర్ సర్వ నాశనం అయింది.. స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్
స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్ చేసింది. ఓ హీరో వల్ల తన కెరీర్ మొత్తం నాశనం అయిందని ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. ఇలా కామెంట్స్ చేసిన హీరోయిన్ మరెవరో కాదు..మనీషా కొయిరాలా. ఆమె కామెంట్స్ చేసిన హీరో ఇంకెవరో కాదు..సూపర్ స్టార్ రజనీకాంత్. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..
హీరోయిన్ మనీషా కొయిరాలా అంటే ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. 1990ల్లో అభిమానులకు మనీషా కొయిరాలా సుపరిచితురాలే. ఆమె తెలియని సినీ అభిమాని ఉండరు. తన అందంతో, నటనతో ఆకట్టుకున్న మనీషా కొయిరాలా.. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఒకే ఒక్కడు, దిల్‌సే వంటి సూపర్ హిట్లతో మనీషా కొయిరాలా స్టార్ హీరోయిన్‌గా మారింది.

కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని తన సినీ జీవితాన్ని తన చేతులారా నాశనం చేసుకుంది. మనీషా కొయిరాలా 19 జూన్ 2010న నేపాల్ పారిశ్రామికవేత్త అయిన సామ్రాట్ దహల్‌ను వివాహం చేసుకుంది. పెళ్లైన ఆరు నెలలకే ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి.దీంతో భర్తకు సామ్రాట్ దహల్ విడాకులిచ్చింది. అయితే పెళ్లికి ముందు మనీషా కొయిరాలా చాలామందితో ప్రేమాయాణం సాగించిందనే వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉంటే మనీషా కొయిరాలా సూపర్ స్టార్ రజనీకాంత్‌పై చేసిన కామెంట్స్ అప్పట్లో సంచలనం సృష్టించాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ వల్లే తన కెరీర్ నాశనమైందని ఆమె చేసిన సంచలన ఆరోపణలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.
సినీనటి మనీషా కోయిరాలా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ వల్లే తన కెరీర్ నాశనమైందని ఆమె చేసిన సంచలన ఆరోపణలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.
2002లో రజినీకాంత్ హీరోగా వచ్చిన "బాబా" చిత్రంలో మనీషా కోయిరాలా కథానాయికగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడమే కాకుండా, తన కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపిందని ఆమె పేర్కొన్నారు. బాబా చిత్రం విడుదలైన తర్వాత ఫ్లాప్ అయింది. దాంతో నేనే చాలా నష్టపోయాను. ఈ మూవీ డిజాస్టర్ తర్వాత సౌత్‌లో ఆఫర్స్ పూర్తిగా తగ్గిపోయాయి. అంతకు ముందు మాత్రం భారీగా దక్షిణాది నుంచి సినిమా ఆఫర్లు వచ్చేవి అని మనీషా తెలిపారు.












Click it and Unblock the Notifications