ఎన్టీఆర్‌ను ఆపేసి... తాను చేసి మరీ అట్టర్ ఫ్లాప్ కొట్టిన అల్లు అర్జున్

తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్. ఇద్దరూ మంచి స్నేహంగా ఉంటారు. ఒకర్నొకరు బావా.. బావా అని పిలుచుకునే స్వతంత్రత ఉంది. తమ దగ్గరకు వచ్చిన కథల గురించి, చేస్తున్న సినిమాల గురించి చర్చించుకుంటారు. ప్రస్తుతం దేవరతో పాన్ ఇండియా హిట్ కొట్టిన జూనియర్ ఎన్టీఆర్ తర్వాత వార్2 సినిమాతోపాటు ప్రశాంత్ నీల్ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభించబోతున్నాడు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 చేస్తున్నారు. డిసెంబరు 6న విడుదల కానున్న ఈ సినిమాతో భారీస్థాయిలో పాన్ ఇండియా హిట్ కొట్టాలనే పట్టుదలతో అల్లు అర్జున్ ఉన్నారు.

వంశీకి హామీ ఇచ్చిన ఎన్టీఆర్
వీరిద్దరికీ రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ సన్నిహితుడు. టెంపర్ సినిమాకు కథ అందించింది కూడా వంశీనే. ఈ సినిమా చేసే సమయంలోనే నీతో ఒక సినిమా చేస్తాను అంటూ వంశీకు తారక్ హామీ ఇచ్చాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఒక కథను తీసుకొని తారక్ కు వినిపించాడు. అయితే దీనిపై అతను ఏమీ మాట్లాడలేదు. మరోసారి కథను వినిపించగా ఆలోచిద్దాం అంటూ ఎన్టీఆర్ దాటవేశాడు. ఎక్కడో తేడా కొడుతోంది అనుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత వక్కంతం వంశీ అల్లు అర్జున్ ను కలిసినప్పుడు తాను ఒక కథను జూనియర్ ఎన్టీఆర్ కు చెప్పినట్లు వివరించారు.

Na peru Surya Na Illu India is the reason why Allu Arjun made the movie

తారక్ కు ఫోన్ చేసిన అల్లు అర్జున్
అయితే ఆ కథను తనకు కూడా చెప్పమని బన్నీ రిక్వెస్ట్ గా అడిగాడు. దీంతో వంశీ ఆ కథను బన్నీకి వివరించాడు. ఈ కథతో సినిమా చేస్తే కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అని వంశీతో చెప్పాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కు అల్లు అర్జున్ ఫోన్ చేసి కథ చాలా బాగుంది.. సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అని చెప్పాడు. అయితే అప్పుడు కూడా తారక్ సానుకూలంగా స్పందించలేదు. కొద్దిరోజులకు ఆ సినిమా చేయను అని వంశీతో జూనియర్ ఎన్టీఆర్ చెప్పేశాడు. ఈ విషయం అల్లు అర్జున్ తో చెప్పగా తాను చేస్తానని దర్శకుడికి బన్నీ హామీ ఇచ్చాడు. వెంటనే ఈ సినిమా వీరిద్దరి కాంబినేషన్ లో పట్టాలెక్కి 'నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా' పేరుతో విడుదలై డిజాస్టర్ గా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+