కల్కి సినిమాపై క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్...
బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఆ తరువాత ప్రభాస్ తీసిన సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీసే. ఇక ఈ స్టార్ హీరో గత సంవత్సరం సలార్ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పడు అందరి చూపులు ప్రభాస్ కల్కి సినిమాపైనే ఉన్నాయి. ఇక, ఇకప్పటికే ఈ సినిమాపై భారీ అంచనానే ఉన్నాయి. ఈ చిత్రం హాలీవుడ్ రేంజ్‌లో రాబోతుంది. అయితే, ఈ సినిమా గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ అభిమానులకు క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. కల్కి సినిమా సీక్రెట్‌ను రివీల్ చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్.
అయితే, ఇప్పటికే కల్కి సినిమాపై నెట్టింట చాలా రూమర్లే వస్తున్నాయి. ఈ సినిమా స్టోరి గురించి కూడా పలు వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పడు తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి సినిమా సీక్రెట్‌ను రివీల్ చేశారు. నాగ్ అశ్విన్ సినాప్స్ అనే ఓ టెక్నాలజీ, మైథాలజీ ఇంటరాక్షన్ మీట్ కి వెళ్లారు. అక్కడ కల్కి సినిమా గురించి నాగ్ అశ్విన్ కొన్ని ఆసక్తికర విషయాలు వివరించారు.

కల్కి 2898AD సినిమా మహాభారతం నుంచి మొదలయి 2898లో పూర్తవుతుందని, అందుకే ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టామని నాగ్ అశ్విన్ అన్నారు. ఇక, ఈ సినిమా 6000 సంవత్సరాల మధ్య జరిగే కథని చూపిస్తుందని, ఇండియన్ మైథాలజీ క్యారెక్టర్స్ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నామని, భవిష్యత్తు ఎలా ఉంటుందనే ఓ ఊహా ప్రపంచాన్ని క్రియేట్ చేసామని ఆయన వివరించారు. దాంతో ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి.
బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు...
కల్కి 2898AD సినిమా హాలీవుడ్ రేంజ్‌లో రాబోతుంది. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ చాలామంది ఉన్నారు. ఈ చిత్రంలో విలక్షణ నటుడు కమల్‌హాసన్ ప్రతినాయకుడు పాత్రలో కనిపించనున్నారు. బిగ్‌బి అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కల్కీ మూవీలో బాలీవుడ్ బ్యూటీలు దీపికా పదుకొనే, దిశాపటాని కూడా హీరోయిన్లుగా మెరవనున్నారు. అతిథిపాత్రలో దర్శక ధీరేంద్రుడు రాజమౌళి, నటుడు దుల్కర్ సల్మార్ ఉండనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications