కల్కి దర్శకుడుకు నోటి దూల ఎక్కువైందే

బాక్సాఫీస్ వద్ద కల్కి దూసుకుపోతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కిలో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించారు. పురాణాలకు, కలియుగాంతానికి, కల్కి అవతారానికి లింక్ చేస్తూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించారు. ఈ సినిమా కంటెంట్, విజువల్స్, వీఎఫ్ఎక్స్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజన్‌కు ఆడియన్స్ ఫిదా అవుతూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

రూ. 600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెకకెక్కిన ఈ సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేశారు. ఈక్రమంలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కుమ్మేసింది. రూ.1000 కోట్లు కలెక్ట్ చేసి ప్రభాస్ స్టామినాను మరోసారి ఈ సినిమా నిరూపించింది. అయితే చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. జగన్ ఓటమి గురించి కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ రియాక్ట్ అయ్యారు. ఒకవేళ ఏపీలో జగన్ తిరిగి విజయం సాధించి ఉంటే .. అప్పుడు టిక్కెట్ రేట్లు పెరిగేవి కాదు కదా..అప్పుడు మీ పరిస్థితి ఏంటనే ప్రశ్న నాగ్ అశ్విన్‌కు ఎదురైంది.

Nag Ashwin indirect comments on sandeep reddy vanga

అలా జరగలేదు కాబట్టే ఫుల్ హ్యాపీగా ఉన్నామని నాగ్ అశ్విన్‌ సమాధానం ఇచ్చారు. జగన్ పార్టీ ఓడిపోవటం వల్లే తమకు ఈ బెనిఫిట్ వచ్చి హ్యాపీగా ఉన్నామని మొహమాటం లేకుండా ఒక్క మాటలో చెప్పేశారు. తాజాగా నాగ్ అశ్విన్‌ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ సినిమాపై పరోక్షంగా కామెంట్స్ చేశారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

'కల్కి' మూవీ 1000 కోట్ల క్లబ్ లో చేరిన సందర్భంగా తన సంతోషాన్ని పంచుకుంటూ ఇన్ స్టాగ్రామ్ స్టోరీ పెట్టాడు నాగ్ అశ్విన్. అయితే ఇందులో ఆయన రాసినది కాంట్రవర్సీ అవుతోంది. రక్తపాతం, అశ్లీలత లేకుండా ఈ ఘనత సాధించడం ఎంతో ఆనందంగా ఉందంటూ నాగ్ అశ్విన్ రాసుకొచ్చాడు. ఈ కామెంట్స్ పరోక్షంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను టార్గెట్ చేసినట్టుగా ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

నాగ్ అశ్విన్ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నాగ్ అశ్విన్ వెంటనే ఆ పోస్టును డిలీట్ చేశారు.నాగ్ అశ్విన్ తన పొగరును తగ్గించుకుంటేనే ఇక మీదట వచ్చే సినిమాలతో సక్సెస్ అవుతాడని..లేకపోతే మాత్రం ఆయన కూడా ఫేడౌట్ అయిపోవాల్సిన పరిస్థితి అయితే వస్తుందని నెటిజన్లు నాగ్ అశ్విన్‌ను హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+