వాయిదా పడిన నాగచైతన్య-శోభిత పెళ్లి... అతన్ని కలిసిన నాగార్జున?
కింగ్ అక్కినేని నాగార్జున తనయుడు, యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య సమంతకు విడాకులిచ్చిన తర్వాత కొంతకాలం ఒంటరిగా ఉన్నాడు. 2022 నుంచి బాలీవుడ్ కు చెందిన తెలుగు నటి శోభిత ధూళిపాళతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ పార్టీలకు వెళ్లడం, విహరించడంలాంటివాటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వచ్చాయి. దీంతో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారంటూ వార్తలు హోరెత్తాయి. వీటిని నిజం చేస్తు ఆగస్టు ఎనిమిదో తేదీన నాగార్జున ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా నిశ్చితార్థం జరిగింది. అప్పటికి వివాహ తేదీని ప్రకటించలేదు.
డిసెంబరు నాలుగున పెళ్లి అనుకున్నారు
ఇటీవలే శోభిత ధూళిపాళ పసుపు దంచే కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు షేర్ చేయడంతో త్వరలోనే వీరి పెళ్లి జరగబోతోందని అందరూ భావించారు. డిసెంబరు నాలుగోతేదీన అన్నపూర్ణ స్టూడియంలోని 22 ఎకరాల స్థలంలో అంగరంగ వైభవంగా వీరి వివాహం చేయాలని నాగార్జున నిర్ణయించారని, అందుకు తగ్గ పనులు కూడా జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం వీరి పెళ్లి వాయిదా పడినట్లు తెలుస్తోంది. కారణాలు తెలియడంలేదుకానీ కుటుంబ సమస్యలవల్లే వివాహ తేదీని వాయిదా వేశారంటున్నారు. నాగార్జున ఇటీవలే ఓ జ్యోతిష్యుడిని సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ఎందుకంటే నాగచైతన్య-శోభిత నిశ్చితార్థం జరిగినరోజు జ్యోతిష్యుడు వేణుస్వామి వీరిద్దరూ 2027లో విడిపోతారని ప్రకటించాడు.

జ్యోతిష్యుడిని సంప్రదించిన నాగార్జున
నాగార్జున సంప్రదించిన జ్యోతిష్యుడు కూడా దాదాపుగా ఇదే విషయాన్ని నాగార్జునకు చెప్పారని, దీంతో వీరిద్దరికి పెళ్లి చేసే విషయంలో కింగ్ పునరాలోచనలో పడ్డాడంటూ వార్తలు రావడంతో అక్కినేని అభిమానులు టెన్షన్ పడ్డారు. పెళ్లి జరుగుతుందా? లేదా? అనే విషయంలో స్పష్టత రావడంలేదు. ప్రస్తుతం వచ్చేనెల నాలుగోతేదీన జరగాల్సిన పెళ్లి వాయిదా పడిందని తెలుస్తోంది. బహుశా వీరిద్దరూ వివాహమైన తర్వాత విడిపోకుండా ఉండాలంటే పెళ్లికి ముందు జ్యోతిష్యులు చెప్పిన దోషాలను తొలగించడానికి పూజలు, హోమాల్లాంటివి చేయించాలని నాగార్జున నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇవన్నీ పూర్తయిన తర్వాత కొత్తగా వివాహ తేదీని ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications